సాధారణంగా ఒక వయస్సు దాటిన తర్వాత చదువుకోవాలనే ఆసక్తి ఉన్నా చాలామంది చదువుకోవాలని భావించినా వేర్వేరు కారణాల వల్ల చదువుకు దూరంగా ఉంటారు.77 సంవత్సరాల వయస్సులో ఒక వ్యక్తి పీజీ పూర్తి చేయడం అంటే సంచలనం అనే సంగతి తెలిసిందే.ఆ వ్యక్తి పేరు లక్ష్మీ నారాయణ శాస్త్రి ( Lakshmi Narayana Shastri )కాగా విద్యార్థులతో కలిసి పాఠాలు విని కెరీర్ పరంగా సక్సెస్ సాధించిన ఈ వ్యక్తి సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తోంది.
పని చేస్తున్న క్యాంపస్ లోనే లక్ష్మీ నారాయణ శాస్త్రి లక్ష్యాన్ని సాధించడం ద్వారా ప్రశంసలు అందుకోవడం జరిగింది.
తపన, సంకల్పం, ధీమా ఉంటే ఆలస్యంగానైనా లక్ష్యాలను సాధించడం సాధ్యమని ఈ వ్యక్తి సక్సెస్ తో మరోసారి ప్రూవ్ అయిందని చెప్పవచ్చు.లక్ష్మీ నారాయణ శాస్త్రి ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ( Triple IT Hyderabad )లో ఇంజినీర్ గా పని చేసి రిటైర్ కావడం జరిగింది.
అయితే తాను పని చేసిన క్యాంపస్ లోనే లక్ష్మీ నారాయణ శాస్త్రి ఎర్త్ క్వేక్ ఇంజినీరింగ్ రీసెర్చ్ సెంటర్( Earth Quake Engineering Research Center ) నుంచి పట్టా పొందడం కొసమెరుపు.చదువుకోవడానికి వయస్సుతో సంబంధం లేదని ఈ వ్యక్తి సక్సెస్ తో మరోసారి ప్రూవ్ అయింది.లక్ష్మీ నారాయణ శాస్త్రి ఫోటోలు సైతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.1947 సంవత్సరంలో ఏఈఈగా ఆయన ఉద్యోగ ప్రస్థానం మొదలైంది.
ట్రిపుల్ ఐటీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులలో ఆయన కూడా ఒకరు కావడం కొసమెరుపు. ప్రొఫెసర్ ప్రదీప్( Professor Pradeep ) ప్రోత్సాహంతో తాను పీజీ పూర్తి చేశానని ఆయన తెలిపారు.పీహెచ్డీ కొరకు పాత భవనాలకు ఇంజనీరింగ్ పరిష్కారాలపై పరిశోధన చేస్తానని లక్ష్మీ నారాయణ శాస్త్రి వెల్లడించారు.లక్ష్మీ నారాయణ శాస్త్రి సక్సెస్ స్టోరీ ఈ జనరేషన్ లో ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.