టాలీవుడ్ ఇండస్ట్రీలో రేలంగి వెంకట రామయ్య( Relangi Venkata Ramaiah ) కామెడీకి కేరాఫ్ అడ్రస్ అయ్యాడు.రేలంగి 1950-60లలో కామెడీ కింగ్‌గా ఒక వెలుగు వెలిగాడు.
కేవలం ఫేస్, ఎక్స్‌ప్రెషన్స్‌తోనే కడుపుబ్బా నవ్వించగల ఏకైక నటుడు రేలంగి.రమణారెడ్డితో కలిసి రేలంగి మరింత నవ్వించాడు.
గుండమ్మ కథ, మాయాబజార్, అప్పుచేసి పప్పుకూడు, లవకుశ, ప్రేమించి చూడు వంటి ఎన్నో సినిమాల్లో రేలంగి కామెడీ సీన్లు ఎంతగానో నవ్విస్తాయి.ఈ నటుడు కాంతారావు, జగ్గయ్య, ఎన్టీఆర్, ఏఎన్నార్లతో కలిసి ఎక్కువగా సినిమాలు చేశాడు.
నిజానికి పేరుకే కమెడియన్ కానీ అప్పట్లో రేలంగిని ఒక హీరోలాగా చూసేవారు.రెమ్యునరేషన్ కూడా ఇంచుమించు హీరోలతో ఈక్వల్ గా ఉండేది.
రేలంగి ఉంటేనే సినిమా హిట్ అవుతుందని అప్పట్లో అనుకునేవారు.అంత డిమాండ్ ఆయనకు ఉండేది.
హీరోలంత అందగాడు కాకపోయినా హీరోలకి ఏమాత్రం తీసుపోని స్టార్‌డమ్ రేలంగికి ఉండేది.అందుకే చాలా కాన్ఫిడెంట్ గా ఉండేవాడు రేలంగి.అయితే ఒకరోజు స్టిల్ ఫొటోగ్రాఫర్ సత్యాన్ని పిలిచి “ఏమోయ్ సత్తిబాబు ఎప్పుడూ ఏఎన్నార్, ఎన్టీఆర్ల ( ANR, NTR )ఫోటోలే తీస్తావా? వారితో సమానంగా నన్ను కూడా ఫోటో తీయవోయ్” అని అన్నాడట.దాంతో సత్యం “సార్ వాళ్లంటే హీరోలు.
మీరు కమెడియన్ కదా.మిమ్మల్ని ఎలా స్టిల్ ఫోటోలు తీయాలి?” అని అమాయకంగా అడిగాడట.
కానీ రేలంగి వినిపించుకోకుండా నాకు ఇప్పుడు హీరోల లాగా ఫోటోలు తీసి పెడతావా లేదా అని మరోసారి అడిగాడట.దాంతో సత్యం కాదనలేక ‘సరే, సార్’ అని రెండు మూడు ఫోటోలు తీశాడు.వాటిని చూసుకుంటూ “నిజమేనోయ్ సత్యం, హీరోలు హీరోలే కమెడియన్లు కమెడియన్లే.నా ముఖం వారితో సమానంగా లేకపోయినా 20% వారిలాగానే కనిపించేలాగా తీశావు.శభాష్” అంటూ సత్యాన్ని రేలంగి మెచ్చుకున్నారు.
సాధారణంగా కమెడియన్లు చాలా కంట్రోల్డ్‌గా ఉంటారు.ఎలా పడితే అలా ఎమోషన్స్ చూపించే మనస్తత్వం వాళ్లకి ఉండదు.దేనినైనా సరదాగా, నిజాన్ని నిజంగా తీసుకునే నిజమైన హీరోలు వాళ్ళు.
అందరినీ కడుపుబ్బా నవ్వించి బాధలను మర్చిపోయేలా చేయగల నిజమైన హీరోలు.వాళ్లు లేకుండా సినిమాలు లేవంటే అతిశయోక్తి కాదు.
రేలంగి గొప్ప కమెడియన్ తెలుగు ఇండస్ట్రీకి దొరకడం మన అదృష్టం అని చెప్పుకోవచ్చు.ఆయన తర్వాత మళ్లీ ఆయన ప్లేస్ ను ఎవరూ భర్తీ చేయలేకపోయారు.