ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక సినిమా 50 రోజుల పాటు ప్రదర్శించబడటం సులువైన విషయం కాదు.ఈ ఏడాది హనుమాన్ మూవీ( Hanuman movie ) 50 రోజుల పాటు థియేటర్లలో ప్రదర్శించబడి సంచలనాలు సృష్టించింది.
ఆ సినిమా తర్వాత 50 రోజుల పాటు ప్రదర్శించబడిన సినిమాగా కల్కి 2898 ఏడీ సినిమా నిలిచింది.ఈరోజు ఎక్కువ సంఖ్యలో సినిమాలు విడుదలైనా కల్కి 2898 ఏడీ( Kalki 2898 AD ) మాత్రం రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ప్రదర్శితమవుతోంది.
కల్కి 2898 ఏడీ మూవీ నాగ్ అశ్విన్ ( Nag Ashwin )సృష్టించిన ఒక సంచలనం అనే సంగతి తెలిసిందే.గతంలో ఎప్పుడూ చూడని కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిందని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.
కల్కి 2898 ఏడీ సీక్వెల్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది.
ప్రభాస్( Prabhas ) తర్వాత ప్రాజెక్ట్ లతో భారీ హిట్లను సొంతం చేసుకోవాలని ఆ సినిమాలు కలెక్షన్ల పరంగా సైతం సరికొత్త రికార్డులను సృష్టించాలని అభిమానులు ఫీలవుతున్నారు.ప్రభాస్ తన సినిమాల కోసం ఎంతో కష్టపడుతున్నారు.ప్రతి సినిమాను స్పెషల్ గా తెరకెక్కించే విధంగా ప్రభాస్ తగిన జాగ్రత్తలను తీసుకుంటూ ఉండటం కొసమెరుపు.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రభాస్ ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు.
ప్రభాస్ ది రాజాసాబ్ సినిమాతో( The Rajasaab ) పాటు ఇతర సినిమాలతో సైతం ఇదే స్థాయిలో మెప్పిస్తారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ది రాజాసాబ్ సినిమా ప్రభాస్ కు భారీ హిట్ ను అందిస్తుందని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో సైతం బాక్సాఫీస్ ను షేక్ చేయాలని అభిమానులు ఫీలవుతున్నారు.
ప్రభాస్ సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేయడంతో పాటు అభిమానులకు ఎంతగానో నచ్చేస్తున్నాయని చెప్పవచ్చు.ప్రభాస్ తన సినిమాలలో ప్రతి సీన్ స్పెషల్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.