కర్పూరం గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు.పూజలు లేదా ఇతర మతపరమైన వేడుకల సమయంలో కర్పూరం( Camphor ) ఉపయోగిస్తాము.
పూజ చేసేటప్పుడు కర్పూరం వెలిగించి దేవుడికి హారతి ఇవ్వడం అనేది పురాతన కాలం నుంచి వస్తున్న ఆచారం.అయితే పూజా సమయంలో మాత్రమే కాదు కర్పూరంతో మరెన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
చాలా మంది కర్పూరాన్ని రసాయనాలతో కృత్రిమంగా తయారు చేస్తారని అనుకుంటారు.కానీ అది నిజం కాదు.
కాంఫర్ లారెల్( Camphor Laurel ) అనే చెట్టు కొమ్మలు, ఆకుల నుంచి కర్పూరం తయారు చేస్తాయి.అందువల్ల ఆరోగ్యపరంగా కర్పూరం మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది.
నిత్యం ఇంట్లో కర్పూరం వెలిగిస్తే బోలెడు లాభాలు పొందవచ్చు.మరి ఆ లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.రోజూ కర్పూరం వెలిగించడం వల్ల మీ ఇంట్లో చెడు వాసన పూర్తిగా తొలగిపోతుంది.కాలుష్యం పోయి వాతావరణం స్వచ్ఛంగా మారుతుంది.కర్పూరం ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని( Positive Energy ) పెంచుతుంది.ఫలితంగా మన మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఒత్తిడి దూరం అవుతుంది.తెలియకుండానే ఎంతో ఆనందంగా మారతారు.
అలాగే మనలో చాలా మంది తరచూ జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడుతుంటారు.అలాంటి వారికి కర్పూరం చాలా మేలు చేస్తుంది.
నిత్యం ఇంట్లో కర్పూరం వెలిగించి ఆ వాసన పీలిస్తే జలుబు, దగ్గు పరార్ అవుతాయి.
తలనొప్పి,( Headache ) మైగ్రేన్ వంటి సమస్యలను అధిగమించడానికి కూడా కర్పూరం తోడ్పడుతుంది.కర్పూరం వాసన పీల్చడం వల్ల ఆయా సమస్యల నుంచి వేగంగా ఉపశమనం పొందుతారు.రోజూ ఇంట్లో కర్పూరం వెలిగించి ఆ వాసన పీలిస్తే అలసట దూరం అవుతుంది.
బాడీ మరియు మైండ్ ఫుల్ ఎనర్జిటిక్ గా మారతాయి.ఇక కర్పూరంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి.
అందువల్ల వాటర్ లో కర్పూరం పొడి వేసి ఇంటిని క్లీన్ చేస్తూ సూక్ష్మక్రిములన్నీ నాశనం అవుతాయి.