సాధారణంగా ఈ కాలంలో హీరోలు ఒకే హీరోయిన్‌తో ఎక్కువ సినిమాలు చేయడానికి ఇష్టపడటం లేదు.ఒక్క హీరోయిన్ కొత్త హీరోయిన్లను తీసుకొచ్చి కొత్త కాంబోలతో ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ చేస్తున్నారు.
అయితే ఇలాంటి కాలంలో అల్లు అర్జున్( Allu Arjun ) ఒక హీరోయిన్ కు మాత్రం మూడుసార్లు ఛాన్స్ ఇచ్చాడు.అతడికి ఆమెపై ఎందుకంత ప్రేమ, ఆమెలో ఉన్న స్పెషల్ ఏంటి అని చాలామంది కూడా ఆశ్చర్యపోయారు కూడా.
పుష్ప సినిమా ( Pushpa movie )తర్వాత అల్లు అర్జున్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.ఇప్పుడు పుష్ప 2 సినిమా( Pushpa 2 movie ) కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
బన్నీ ఐకాన్ స్టార్, యూత్ ఐకాన్ గా మారాడు అంటే అతిశయోక్తి కాదు.
ఒకప్పుడు బన్నీ అంటే సౌత్ ఇండియాలో మాత్రమే తెలుసు కానీ ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా అల్లు అర్జున్ అంటే ఎవరో తెలిసిపోయింది.
దీని అంతటికి కారణం పుష్ప సినిమాలో అతను చేసిన పుష్పరాజ్ పాత్ర అని చెప్పుకోవచ్చు.తగ్గేదేలే అనే డైలాగ్‌తో ఈ హీరో ఫారిన్ కంట్రీస్ లో కూడా ఫేమస్ అయ్యాడు.
ఫస్ట్ నుంచి అల్లు అర్జున్‌తో ఒక్క సినిమా అయినా చేయాలని హీరోయిన్ లో కలలు కనేవారు.అలాంటిది ఒక హీరోయిన్ మాత్రం ఏకంగా మూడుసార్లు బన్నీతో కలిసి నటించే అవకాశాన్ని దక్కించుకుంది.
ఆమెకు అన్నిసార్లు ఆఫర్ ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే బన్నీ ఆమెపై మనసు పారేసుకున్నాడట.ఆ హీరోయిన్ మరెవరో కాదు కేథరిన్ థ్రెస్సా( Catherine Thressa ).
వరుణ్ సందేశ్ హీరోగా నటించిన “చమ్మక్ చల్లో” సినిమాతో( Chammak Challo ) కేథరిన్ టాలీవుడ్ ఇండస్ట్రీకి సుపరిచితురాలు అయ్యింది.తర్వాత బన్నీ హీరోగా నటించిన “ఇద్దరమ్మాయిలతో” సినిమాలో సెకండ్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది.ఈ మూవీలో కేథరిన్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పక్కన చాలా చూడముచ్చటగా కనిపించింది.ఆ సినిమా తర్వాత ఈ అందాల తార తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చాయి.
అయితే అల్లు అర్జున్ ఆమెను సరైనోడు సినిమాలో కూడా రిపీట్ చేశాడు కాకపోతే సెకండ్ హీరోయిన్ గా.
ఈ మూవీ సూపర్ హిట్ కాగా ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది.సాధారణంగా బన్నీ తన కెరీర్ మొత్తంలో హీరోయిన్లను మూడోసారి కలిసి నటించలేదు.కానీ కేథరిన్ ఎక్సెప్షన్ ఇచ్చాడు.
రుద్రమదేవి సినిమాలో బన్నీ గోన గన్నారెడ్డిగా నటించగా కేథరిన్ అతని సతీమణి అన్నాంబికా గా నటించి మెప్పించింది.ఎందుకంటే సహజంగానే ఆమెను బన్నీ బాగా ఇష్టపడ్డాడట.
అందుకే అవకాశాలను ఇచ్చాడు.బన్నీ వల్ల ఆమెకు టాలీవుడ్ లో బాగానే అవకాశాలు వచ్చాయి.
పైసా, గౌతమ్ నంద, నేనే రాజు నేనే మంత్రి వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాల్లో ఆమెకు ఛాన్సెస్ వచ్చాయి.ఈ ముద్దుగుమ్మ మంచి పేరే సంపాదించింది.