కేరళను కుదిపేసిన కారులో హీరోయిన్ పై లైంగిక దాడి.... ఎన్నెళ్ళయిన దొరకని న్యాయం

‘ఒంటరి’, ‘మహాత్మ’ సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన హీరోయిన్ భావన ( Heroine Bhavana )గుర్తుందా.ఈ ముద్దుగుమ్మ నిప్పు, హీరో వంటి తెలుగు మూవీస్ కూడా చేసింది.

 No Update In Heroine Bhavana Issue , 'ontari' , 'mahatma', Heroine Bhavana,-TeluguStop.com

ఈమె అసలు పేరు కార్తీక మీనన్.సినిమాల కోసం భావనగా పేరు మార్చుకుంది.ఈ అందాల తార ప్రధానంగా మలయాళం, కన్నడ భాషా చిత్రాలలో నటిస్తుంది.2024లో ఆమె 4 సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.ఈ ఏడాది ఆమె నటించిన మరో 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి.భావన కెరీర్ లైఫ్‌ బాగానే సాగుతోంది కానీ పర్సనల్ లైఫ్‌లో ఏ హీరోయిన్ అనుభవించని దారుణాన్ని అనుభవించింది.

ఓ రోజు షూటింగ్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఆమెను కిడ్నాప్ చేసి ఓ ముఠా లైంగిక వేధించింది.కదులుతున్న కారులో గంటసేపు ఆమెపై ఈ లైంగిక దాడి జరిగింది.

ఆ తర్వాత ఒక రోడ్డు మీద వదిలేశారు.

ఆ వ్యక్తులు గంట సమయంలో ఆమెను రేప్ చేయకుండా ఉంటారా అని చాలామంది ప్రశ్నించారు కానీ ఒక రేప్‌ విక్టమ్‌గా తనను తాను చూసుకోలేక లైంగిక దాడి మాత్రమే జరిగింది భావన చెప్పుకున్నట్లు పలువురు అభిప్రాయపడ్డారు.

ఏది ఏమైనా ఒక ఆడ బిడ్డకు ఇలా జరగడం ఏ మాత్రం సహించరానిది.ఈ పని చేసిన వారిని ఉరి తీసినా తప్పులేదు కానీ ఈ హీరోయిన్‌కి ఇప్పటి దాకా న్యాయం జరగలేదంటే నమ్ముతారా.

Telugu Bhavana, Karthika Menon, Mahatma, Malayalamdilip, Ontari, Sexual Assault-

2017, ఫిబ్రవరిలో ఆమెపై లైంగిక దాడి జరగక దీనిపై కంప్లైంట్ ఇచ్చింది.నాలుగు నెలల తర్వాత మలయాళ హీరో దిలీప్ కుమార్ ( Malayalam hero Dilip Kumar )ఈ పని చేయించాడని పోలీసులు తేల్చారు.దిలీప్ 1992 నుంచి సినిమాల్లో కొనసాగుతున్నాడు.మొదటగా నటి మంజు వారియర్‌ను పెళ్లాడాడు, ఆపై ఆమెతో పెటాకులు అయ్యాయి.తర్వాత హీరోయిన్‌ కావ్య మాధవన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

దిలీపే ఈ దారుణం వెనుక కీలక సూత్రధారి అని అనుమానించిన అధికారులు అతన్ని పిలిచి విచారించారు.

అయితే తనకు ఈ దారుణంతో ఎలాంటి సంబంధం లేదని భావన కావాలనే తనని ఇరికిస్తోందని ఆరోపించాడు.తనకు ఎక్స్‌ట్రా మారిటల్ అఫైర్ కూడా ఉన్నట్లు అందరికీ చెప్తానని కూడా బెదిరించినట్లు తెలిపాడు.

కానీ పోలీసులు మాత్రం అతని నమ్మలేదు.మూడు నెలలు పాటు దిలీప్ జైల్‌లో ఉండిపోయాడు.

స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేకపోవడం వల్లనో ఇంకేదైనా కారణాలవల్లో అతడు జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చేసాడు.ఈ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో నడుస్తోంది.

ఇప్పటిదాకా ఒక తీర్పు అనేది రాకపోవడం చాలా విషాదకరం.

Telugu Bhavana, Karthika Menon, Mahatma, Malayalamdilip, Ontari, Sexual Assault-

లైంగిక దాడికి గురై తీవ్ర మానసిక క్షోభతో సతమతమవుతున్న భావనకు మలయాళ ఇండస్ట్రీ అండగా నిలవలేదు.ఆమెదే తప్పు అన్నట్లు ఈ ఇండస్ట్రీ వాళ్లు ఆమెకు 2017 నుంచి 2023 దాకా అవకాశాలు ఇవ్వకుండా దూరం పెట్టారు.దీంతో చేసేదేమీ లేక ఆమె కన్నడ ఇండస్ట్రీలో సినిమాలు చేయడం మొదలు పెట్టింది.

ఈ హీరోయిన్ పై జరిగిన లైంగిక దాడి తర్వాత కేరళ ప్రభుత్వం బాగానే ట్రై చేసింది.హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి హేమ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది.

కమిటీ సభ్యుల్లో తెలుగు నటి శారద, విశ్రాంత ఐఏఎస్ అధికారిణి కె.బి.వత్సలకుమారి ఉన్నారు.మలయాళం ఇండస్ట్రీలో యాక్ట్రస్‌లు, మహిళలు పడుతున్నా ఇబ్బందులను అలాగే ఉన్న సెక్యూరిటీని విచారించే ప్రభుత్వానికి ఒక నివేదిక అందించాలని కేరళ గవర్నమెంట్ కోరింది.2019, డిసెంబరులో అప్పటి కేరళ సీఎం పినరయి విజయన్‌కి కమిటీ 300 పేజీల రిపోర్ట్ అందించగా అందులో ఏముందో బయటకు చెప్పలేదు.యాక్ట్రెస్‌లకు అదనపు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందిగా ఆ పేజీల్లో రాసినట్లు తెలిసింది.

అలాగే సమాన పారితోషికం ఇవ్వాలని కూడా అందులో సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube