చర్మం అన్నాక మొటిమలో, మచ్చలో, ముడతలో, పొడి బారడమో, జిడ్డుగా మారడమో.ఇలా చెప్పుకుంటూ పోతే ఏదో ఒక సమస్య ఇబ్బంది పెడుతూనే ఉంటుంది.
వీటిని నివారించుకునేందుకు మార్కెట్లో దొరికే ఖరీదైన క్రీములు, లోషన్లు, మాయిశ్చరైజర్లు, సీరమ్‌లు ఇలా ఎన్నెన్నో యూజ్ చేస్తుంటారు.అయితే ఇవన్నీ పక్కన పెడితే.
ఇప్పుడు చెప్పబోయే డ్రింక్‌ను ప్రతి రోజు తీసుకుంటే గనుక అనేక చర్మ సంబంధిత సమస్యలను దూరం చేసుకోవచ్చు.మరి ఆ డ్రింక్ ఏంటో.? ఎలా తయారు చేయాలో.? ఎప్పుడు తాగాలో.? అసలు ఆ డ్రింక్‌ను తాగడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో.? ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక గిన్నె పెట్టుకుని అందులో గ్లాస్ వాటర్ పోయాలి.కాస్త వాటర్ హీట్ అయ్యాక అందులో ఒక స్పూన్ సోంపు, ఒక అనాస పువ్వు, అర స్పూన్ యాలకుల పొడి, రెండు స్పూన్ల గులాబీ రేకులు వేసి మరిగించాలి.
గులాబీ రేకులు ఎండ బెట్టినవీ తీసుకోవచ్చు.లేదా ఫ్రేష్‌గా ఉండేవి కూడా తీసుకోవచ్చు.వాటర్ బాగా మరిగి కలర్ ఛేంజ్ అయిన తర్వాత స్టవ్ అఫ్ చేసి బాగా చల్లారనివ్వాలి.అపై వాటర్‌ను వడబోసుకుని సేవించాలి.

ఈ డ్రింక్‌ను ప్రతి రోజు ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే.కేవలం కొద్ది రోజులకే మీ స్కిన్ తెల్లగా, కాంతివంతంగా మారడాన్ని గమనిస్తారు.అలాగే రెగ్యులర్‌గా ఈ న్యాచురల్ హెల్తీ డ్రింక్‌ను సేవించడం వల్ల మొటిమలు రాకుండా ఉంటాయి.ఒక వేళ మొటిమలు, మచ్చలు ఉన్నా తగ్గు ముఖం పడతాయి.ఈ డ్రింక్‌లో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.
అందు వల్ల, ఈ సూపర్ డ్రింక్‌ను ప్రతి రోజూ తీసుకుంటే వృద్ధాప్య ఛాయలు త్వరగా దరి చేరకుండా ఉంటాయి.
డ్రై స్కిన్ సమస్య దూరం అవుతుంది.మరియు చర్మం గ్లో, హైడ్రేటెడ్‌గా ఉంటుంది.
ఇక ఈ డ్రింక్ ఆరోగ్యానికి సైతం ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
ఒత్తిడి, డిప్రెషన్, తల నొప్పి వంటి మానసిక సమస్యలు తగ్గుతాయి.మరియు మెదడు చురుగ్గా మారుతుంది.