అతిగా చికెన్ తింటున్నారా..? అయితే ఇది తెలుసుకోండి..!

ఈ మధ్యకాలంలో చాలామంది చికెన్ అతిగా తింటూ ఉన్నారు.అయితే చికెన్ అతిగా తింటే వెంటనే ఆపేయడం మంచిది.

 Are You Eating Too Much Chicken? But Know This.., Chicken ,  Health , Health Tip-TeluguStop.com

లేదంటే ప్రమాదమే అని ఆరోగ్య సంస్థ వార్నింగ్ ఇచ్చింది.చికెన్ ఎక్కువగా తిన్న వాళ్ళలో యాంటీ మైక్రోబయల్ రేసిస్టెన్స్ అనే వ్యాధికి దారితీస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల సూచించడం జరిగింది.

అయితే పౌల్ట్రీ నుంచి వస్తున్న చికెన్ అతిగా తినడం వలన ఎలాంటి సమస్యలు వస్తాయని డబ్ల్యుహెచ్ఓ డాక్టర్లు కూడా ప్రత్యేక రిపోర్టును విడుదల చేశారు.ఇక ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సమస్య ఉన్నదని డబ్ల్యుహెచ్ఓ( WHO ) చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది.

అయితే వాస్తవానికి చికెన్ లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి.దీని వలన చాలామంది చికెన్ తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు.

Telugu Chicken, Tips, Immunity, Poultry, Proteins-Telugu Health

ఇక చిన్నారుల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా చికెన్ ఇష్టంగా తింటారు.ఇక కరోనా సమయంలోనే చికెన్ వినియోగం ఎక్కువగా మారిపోయింది.అయితే ఇప్పటికీ డైలీ చికెన్ తినేవాళ్ళు చాలామంది ఉన్నారు.అయితే అతిగా చికెన్ తినడం వలన ఆరోగ్యం పై ప్రభావం పడుతుందని డబ్ల్యుహెచ్ఓ రిపోర్టు లో పేర్కొనడం జరిగింది.

ఇక ముఖ్యంగా ఫామ్ నుంచి ఉత్పత్తి చేసిన కోళ్ల నుండి ఈ సమస్య ఎక్కువగా వస్తున్నట్లు కూడా స్పష్టం చేసింది.ఇక కోళ్ల పౌల్ట్రీ( Poultry ) లో ప్రస్తుత కోళ్ళు వృద్ధి చెందేందుకు చికెన్ ఆరోగ్యంగా ఉంచడానికి అవసరానికి మించి యాంటీబయోటిక్స్ ను ఇస్తున్నారు.

Telugu Chicken, Tips, Immunity, Poultry, Proteins-Telugu Health

అలాగే కోళ్లు వ్యాధుల బారిన పడకుండా కూడా మందులను ఇస్తున్నారు.ఆ కోళ్ళ శరీరం కెమికల్ మయంగా మారిపోతుంది.సదరు కోళ్ల శరీరంలో పెద్ద మొత్తంలో యాంటీబయాటిక్ పేరుకు పోతుంది.అయితే ఇలాంటి చికెన్ తిన్న వాళ్ళ శరీరంపై నేరుగా ప్రభావం పడుతుంది.యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ పెరగడంతో రోగనిరోధక శక్తి( Immunity ) తగ్గిపోతుంది.అలాంటి పరిస్థితుల్లో ఎన్నో రకాల ఇన్ఫెక్షన్లకు గురవ్వాల్సి వస్తుంది.

అందుకే అతిగా చికెన్ తింటున్న వాళ్ళని వెంటనే ఆపేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube