సమ్మర్ సీజన్ లో భానుడి ప్రతాపం రోజు రోజుకీ భారీగా పెరిగిపోతుంది.భగ భగ మండే ఎండల కారణంగా బయటకి వెళ్లే సాహసం కూడా చెయ్యలేకపోతారు ప్రజలు.
ఈ సీజన్‌లో ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తరచూ చెబుతూనే ఉంటారు.అయితే సమ్మర్‌లో ఆరోగ్యాన్ని కాపాడటంలో కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా సహాయపడతాయి.
అలాంటి వాటిలో నేరేడు పండు కూడా ఒకటి.
కాస్త వగరుగా, కాస్త తియ్యగా మరియు కొద్దిగా పుల్లగా ఉండే నేరేడు పండ్లలో విటమిన్ బి, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, ఫాస్పరస్, ప్రోటీన్స్ ఇలా ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.
అందుకే నేరేడు పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతుంటారు.అయితే ముఖ్యంగా ఈ వేసవి కాలంలో తరచూ నేరేడు పండ్లు తీసుకుంటే అనేక బెనిఫిట్స్ పొందొచ్చు.

సాధారణంగా సమ్మర్ సీజన్ వచ్చిందంటే చాలా మందిలో డీహైడ్రేషన్ సమస్య కనిపిస్తూ ఉంటుంది.అయితే శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా చేయడంలో నేరేడు పండ్లు సహాయపడతాయి.నేరేడు పండ్లలో పోషకాలతో పాటు వాటర్ కంటెంట్ కూడా పుష్కలంగా ఉంటుంది.కాబట్టి, తరచూ కొన్ని నేరేడు పండ్లు తీసుకుంటే శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది.
అలాగే ఈ సీజన్‌లో స్కిన్ తరచూ డ్రైగా మారడం, కాంతిహీనంగా మారడం జరుగుతుంటుంది.మరియు రాషెస్ కూడా వస్తుంటాయి.
అయితే నేరేడు పండ్లు తరచూ తీసుకుంటే ఈ సమస్యలు దూరమై క్లియర్ స్కిన్ మీ సొంతం అవుతుంది.నేరేడు పండ్లు తరచూ తీసుకుంటే వేసవిలో వేధించే అతిదాహం, నీరసం, అలసట వంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.
ఇక ఈ సీజన్‌లో ఎండల కారణంగా చాలా మంది బీపీ సమస్యతో బాధపడుతుంటారు.అయితే నేరేడు పండ్లు తీసుకుంటే బ్లడ్ ప్రెజర్ ఎప్పుడూ కంట్రోల్‌లో ఉంటుంది.