అధిక రక్తపోటు ఉన్నవారు కాఫీ త్రాగకూడదా.. తాగితే ఏమవుతుందో తెలుసా..!

ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు నిద్ర లేవగానే సేవించి ముఖ్యమైన పానీయాలలో కాఫీ( Coffee ) ఒకటి.చాలా మంది ప్రజలకు కాఫీ తాగితే తలనొప్పి తగ్గుతుందని చెబుతూ ఉంటారు.

 People With High Blood Pressure Should Not Drink Coffee Do You Know What Happens-TeluguStop.com

ముఖ్యంగా చెప్పాలంటే కాఫీ తాగడం వల్ల రక్తపోటు( blood pressure ) పెరుగుతుందని కొన్ని అధ్యయనాలలో తెలిసింది.కాఫీ తాగిన వెంటనే రక్తపోటులో తాత్కాలిక పెరుగుదల ఉంటుంది.

ముఖ్యంగా చెప్పాలంటే ప్రతిరోజు కాఫీ తాగే అలవాటు ఉంటే శరీరంలో రక్తపోటు హెచ్చుతగ్గులు ఉంటాయి.ఇది ఆరోగ్యానికి అసలు మంచిది కాదు.

అధిక రక్తపోటు ఉన్నవారు కాఫీ ఎక్కువగా తాగడం అసలు మంచిది కాదు.దీంతో రక్తపోటు సమస్య ఇంకా పెరుగుతుంది.అధిక రక్తపోటు ఉన్న వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.కాబట్టి మీకు అధిక రక్తపోటు ఉన్నట్లయితే కాఫీ కి దూరంగా ఉండటమే మంచిది.

అధిక రక్తపోటు ఉన్నవారు కొన్ని సమయాల్లో కాఫీ అసలు తాగకూడదు.వ్యాయామం, బరువు ఎత్తడం( Exercise and weight lifting ) లేదా ఇతర శరీరక శ్రమ చేసే ముందు కాఫీ తాగకూడదు.

ఎందుకంటే వ్యాయామం చేసేటప్పుడు రక్త పోటు పెరుగుతుంది.అధిక రక్తపోటు ఉన్న వారికి కాఫీ ఎక్కువగా తాగే అలవాటు ఉంటే నెమ్మదిగా తగ్గించుకోవడమే మంచిది.అధిక రక్తపోటు ఉన్నవారు పాలు తాగడం( drinking milk ) ఎంతో మంచిది.ఇందులో పొటాషియం,కాల్షియం, మెగ్నీషియం ఉండడం వల్ల అధిక రక్తపోటును తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.

కాఫీకి బదులుగా పాలు తాగడం అలవాటు చేసుకోవడం మంచిది.

అధిక రక్తపోటు ఉన్నవారు టమాటో రసం తాగడం వల్ల అధిక రక్తపోటు సమస్య తగ్గినట్లు కొన్ని అధ్యయనాలు తెలిసింది.40 సంవత్సరాల వయస్సు తర్వాత రక్తపోటు సమస్య చాలా మందిలో కనిపిస్తుంది.మీకు రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి రోజు ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తాగడం ఎంతో మంచిది.

అంతే కాకుండా ప్రతి రోజు దానిమ్మ రసం త్రాగడం వల్ల కూడా అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube