సినీనటి పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్(Renu Desai) ప్రస్తుతం తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈమె రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాలు కీలకపాత్రలో నటిస్తున్నారు.
ఇలా తిరిగి సినిమాల పరంగా బిజీ అవుతున్నటువంటి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.ఇలా తరచూ సోషల్ మీడియా వేదికగా ఎన్నో విషయాలను తెలియజేస్తూ ఉంటారు.
అయితే ఈమె చేస్తే పోస్టులలో ఎన్నో అర్థాలు దాగి ఉంటాయి.అయితే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్ట్ చూస్తే ఈమె చాలా ఎమోషనల్ అవుతూ చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేస్తూ.మండుటెండలో ఇలా చల్లని మేఘాలలా మన జీవితంలోకి కొందరు అనుకోకుండా వస్తుంటారు.వారి చూపులతోనే మన మనసులను గుచ్చుతూ… మనతో మాట్లాడుతూ ఉంటారు.అదొక అంతుచిక్కని ఒక మూగ భాషలా ఉంటుంది.అయితే వారు మనతో కొన్ని గంటల పాటు ఉన్న ఆ ప్రభావం మనపై జీవితాంతం ఉంటుంది.అయితే అందులో ప్రయాణాలు చాలా బాధగా కూడా ఉండవచ్చు.
కొంతమంది మన జీవితాలను పరిపూర్ణం చేసి మన కన్నీళ్లను తుడిచి మన జీవితంలో మరింత కాంతిని పంచుతూ మనల్ని నవ్విస్తారు అంటూ ఈమె పోస్ట్ చేశారు.

ఇలా రేణు దేశాయ్ చేసిన ఈ పోస్ట్ కనుక చూస్తుంటే ఈమె పరోక్షంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తన జీవితంలోకి వచ్చి వెళ్లిన సంఘటన గురించి ఈ పోస్ట్ చేశారా అనే సందేహాలు వెల్లు వెత్తుతున్నాయి.ఏదిఏమైనా రేణు దేశాయ్ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ అయింది.ఇక పవన్ కళ్యాణ్ తో విడాకులు(Divorce) తీసుకున్న తర్వాత ఈమె రెండో పెళ్లి చేసుకోబోతున్నాను అని ప్రకటించడంతో పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ అభిమానులు తనకు వార్నింగ్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే.
అయితే ఈ విషయంపై పవన్ అభిమానులకు ఈమె కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.ధైర్యం ఉంటే మీ హీరోని ఇంకో పెళ్లి చేసుకోకుండా ఎందుకు ఆపలేదు అంటూ ప్రశ్నించారు.
ఇలా పవన్ తో విడాకులు తీసుకున్నటువంటి ఈమె తన పిల్లలతో కలిసి ఒంటరిగా గడుపుతున్న విషయం తెలిసిందే.







