ముస్తాబాద్ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులను కార్మిక సంఘాలను పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్ర గత ప్రభుత్వం చేసింది కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ కార్మికులను అక్కున చేర్చుకొని వారికి 21% ఫిట్ మెంట్ పెంచింది అన్నారు.

 Palabhishekam To Chief Minister Revanth Reddy's Portrait At Mustabad Mandal Cent-TeluguStop.com

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించింది.పథకం ప్రారంభించినప్పటి నుంచి 28 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకున్నారు.

దీనికి ఆర్టిసి ఉద్యోగులు ఎంతో సహకరించారు.అందుకే వారికి సకాలంలో జీతాలు చెల్లిస్తూ వారి జీతభత్యాలు పెంచే కార్యక్రమం చేపట్టి వారికి అండగా నిలుస్తుంది కాంగ్రెస్ పార్టీ అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేరుస్తుంది అన్నారు.దాని నిదర్శనమే ఇప్పటివరకు ఇచ్చిన గ్యారంటీలు అన్నారు.

ఉచిత విద్యుత్ పైన కూడా ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తూ ప్రజల్ని అయోమయానికి గురిచేస్తున్నాయని ప్రజలారా వారి మాటలు నమ్మవద్దు.జీరో కరెంటు బిల్లు రానివారు స్థానికంగా ఉన్న ఎంపీడీవో ఆఫీస్ లో ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ తీసుకెళ్లి ఇవ్వాలన్నారు.

ఏదైనా సాంకేతికపరమైన సమస్యలు ఉంటేనే జీరో బిల్లు రావడం లేదు ఆ సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు కృషి చేస్తున్నారన్నారు.దీనిపై ఎలాంటి అపోహలు వద్దు అన్నారు.

అలాగే ఈరోజు ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా కాళీ జాగా ఉన్నవారికి ఐదు లక్షల సహాయం చేసేందుకు ఈరోజు నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తు పేదింటి కలను నెరవెర్చే కార్యక్రమం తీసుకునీ బడుగు బలహీన వర్గాల బతుకుల్లో వెలుగు నింపే కార్యక్రమం చేస్తుందన్నారు.ఇచ్చిన అన్ని గ్యారెంటీలను అమలు చేయడమే కాంగ్రెస్ పార్టీ నైజం అన్నారు.

ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గుండం నర్సయ్య, పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, ఎంపిటిసి గుండేల్లి శ్రీనివాస్ గౌడ్,జిల్లా ప్రధాన కార్యదర్శిలు కొండం రాజిరెడ్డి,మిర్యల్కార్ శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు బుర్ర రాములు, కిసాన్ సేల్ మండల అధ్యక్షుడు సారగొండ రామ్ రెడ్డి,ప్యాక్స్ డైరెక్టర్ కొండల్ రెడ్డి,ఎస్సీ సెల్ బీసీ సెల్ మండల అధ్యక్షులు తలారి నర్సింలు, శ్రీల ప్రశాంత్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రంజాన్ నరేష్, సోషల్ మీడియా మండల అధ్యక్షుడు ఎదునూరి భానుచందర్,మద్దికుంట మొర్రయిపల్లె,చికోడ్, కొండాపూర్,గూడెం,పోతుగల్ గన్నేవారిపల్లె, సేవాలాల్ తండా, తేర్లుమద్ది,బదనకల్ గ్రామ శాఖ అధ్యక్షులు కుడుదల కొండయ్య, కుమార్, కొప్పు రమేష్,గాంత రాజు, సడిమేల బాలయ్య, ఆనమేని రాజు, మల్లేష్,మున్నా నాయక్, శ్రీకాంత్, రాయం రంజిత్ ,మాజీ సర్పంచ్ ఓరగంటి తిరుపతి, సీనియర్ నాయకులు దీటి నర్సింలు, వేముల సత్యంగౌడ్, దీకొండ దశరథం, డాకూరి మహేందర్,చిట్నేని ఆంజన్ రావు, కలగొండ కిషన్ రావు, కనమెని శ్రీనివాస్ రెడ్డి, మామిండ్ల ఆంజనేయులు, తుపాకుల శ్రీనివాస్,శీలం రాజనర్సు, తోట ధర్మేందర్, యాగండ్ల మల్లేశం, బాలసాని శ్రీనివాస్ గౌడ్,సద్ది మధు, సూదన్ రెడ్డి ,పోతారం నవీన్ గౌడ్,కొట్టూరి నవీన్ సాయి, కొండయ్య,ముక్క నరసయ్య, మాడూరి కిషన్, ఓదెల శ్రీనివాస్,శంకర్,బొప్పా తిరుపతి,బొప్ప విష్ణు, చందు, బొప్ప రమణ తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube