మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రోడ్డ రామచంద్రం ,రాజన్న సిరిసిల్ల జిల్లా :అక్రమ అరెస్టులతో తమ ఉద్యమాన్ని ఆపలేవని మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రోడ్డ రామచంద్రం అన్నారు.జాతీయ మాల మహానాడు అధ్యక్షులు చెన్నయ్య పిలుపుమేరకు గురువారం హైదరాబాదులో అసెంబ్లీ ముట్టడి తలపెట్టిన కార్యక్రమానికి వెళ్తున్న తమను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం అన్యాయమని పేర్కొన్నారు.
అరెస్టు అయిన వారిలో మాల మహానాడు రాష్ట్ర అధికార ప్రతినిధి ఎడ్ల రాజకుమార్, ఎల్లారెడ్డిపేట మండల ఇన్చార్జి ఎడ్ల సందీప్ ఉన్నారు.