చిన్న చిన్న అవసరాలకు లోన్ యాప్ లలో లోన్ తీసుకోని విలువైన ప్రాణం పణంగా పెట్టకండి - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా : ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు అధికమతున్నాయి.స్మార్ట్ ఫోన్ ల వినియోగం విరివిగా అందుబాటులోకి రావడంతో నిత్యం ఏదో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం అలవాటుగా మారింది.

 Dont Risk Your Precious Life By Not Taking Loan On Loan Apps For Small Needs Dis-TeluguStop.com

ఇటీవలి కాలంలో లోన్ ఆప్ అప్లికేషన్ల యొక్క మోసాలు ఎక్కువ ఆవుతున్నందు వలన తక్షణ అవసరాల కోసం లోన్ యాప్ లు డౌన్లోడ్ చేసి లోన్ తీసుకోవద్దు అని ప్రాణాలను పణంగా పెట్టి ఆత్మహత్యలకి పాల్పడవద్దని ఎస్పీ సూచించారు.ఒకసారి మనం లోన్ అప్ ను మొబైల్ ఫోన్ లో డౌన్లోడ్ చేయగానే టర్మ్స్ అండ్ కండిషన్స్ అడుగుతుంది అని ఒకే చేయగానే మన మొబైల్ ఫోన్ లో ఉన్న మొత్తం కాంటాక్ట్స్ లిస్ట్ ,డేటా మొత్తం సైబర్ నెరగళ్ల చేతికి వెళ్తుంది అని అన్నారు.

సైబర్ నెరగళ్లు లోన్ అప్లికేషన్ల ద్వారా రెండు మూడు దఫాలుగా లోన్ ఇచ్చి తిరిగి లోన్ చెల్లించాలని వేధిస్తారని లేకపోతే మీ ఫొటోస్ మార్ఫింగ్ చేసి మీ బంధువులకు,స్నేహితులకు పంపిస్తాము అంటూ వేధింపులకు గురి చేస్తారని మీదగ్గర డబ్బులు లేకుంటే ఇతర లోన్ అప్ ల లింక్ లు పంపించి వాటి నుండి లోన్ తీసుకొని కట్టాలని చెపుతారు, ఇటీవల మంచిర్యాలలో ఒక అమ్మాయి లోన్ అప్ డౌన్లోడ్ చేసుకోని లోన్ తీసుకొని ఎన్ని సార్లు కట్టిన పదే పదే సైబర్ నేరగాళ్లు వేధిస్తే ఆ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నది అని,కష్టపడందే ఊరికే ఎవరికి డబ్బులు రావు అని అవగాహనతో వ్యవహరించి సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్త ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో ఈ వారం వ్యవధిలో జరిగిన కొన్ని సైబర్ కేసు వివరాలు.

1.వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితునికి అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది.

తను దాని ఎగ్జిక్యూటివ్ ఆన్లైన్ లోన్ ఆప్ నుంచి కాల్ చేస్తున్నానని పరిచయం చేసుకున్నాడు.బాధితుని పేరు మీద లోన్ సాంక్షన్ అయిందని రిజిస్ట్రేషన్ ఫీజు,అప్రూవల్ ఫీజ్ మరియు ప్రాసెసింగ్ ఫీజు అని డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు.

సైబర్ నేరస్థుడు ఇలా వరుసగా డబ్బులు అడగడంతో బాధితుడు మోసపోయానని భావించాడు.తద్వారా 63,500/- రూపాయలు మోసపోయాడు.

2.సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితునికి అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది.

తనకు జాబ్ ఆఫర్ ఉంది అని చెప్పి ప్రాసెసింగ్ ఫ్రీ అని లాప్టాప్ చార్జ్ అని మరియు ట్రైనింగ్ చార్జెస్ అని డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు.ఇలా వరుసగా డబ్బులు అడగడంతో బాధితులు మోసపోయానని భావించాడు.తద్వారా 10,000/- రూపాయలు నష్టపోయాడు.

3.సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఒక బాధితుడు లోన్ అప్లికేషన్ లో 20,000 వరకు లోన్ తీసుకొని 60,000 వరకు కట్టాడు అయిన మరలా తిరిగి చెల్లించాలని వేధించడం తో సైబర్ సెల్ వారిని ఆశ్రయించాడు.

సైబర్ నేరాలకు చెక్ పెట్టాలంటే…పోలీసుల వారి సూచనలు తప్పక పాటించండి:

1.తక్కువ వడ్డీకి లోన్ ఇస్తామంటే నమ్మవద్దు.ఏ ఫీజూ కట్టవద్దు.
2.రిజిస్ట్రేషన్ లేని లోన్ యాప్ ల నుంచి లోన్ తీసుకోకండి, వారు పెట్టె బాధలకు గురికావొద్దు.
3.తెలియని నెంబర్ నుంచి వాట్సాప్ లో కానీ ఇంస్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్లో కానీ వీడియో కాల్ వస్తే యాక్సెప్ట్ చేయకండి.
4.కస్టమర్ కేర్ నెంబర్ ల కొరకు ఎట్టిపరిస్థితుల్లో గూగుల్ లో వెతకకండి సంబంధిత అధికారిక వెబ్ సైట్ అప్లికేషన్స్ లోనే ఫిర్యాదుల కొరకు నెంబర్ ఉంటుంది
5.ఎవరైనా మెసేజ్/కాల్ చేసి మీకు లోన్ అప్రూవ్ అయ్యింది అని అంటే నమ్మకండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube