వ్యవసాయ పొలాల వద్ద, వన్యప్రాణుల కోసం విద్యుత్ తీగలు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు..

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అరెస్ట్ వివరాలు వెల్లడించిన చందుర్తి సి.ఐ కిరణ్ కుమార్.

 Strict Action Will Be Taken If Electric Wires Are Installed At Agricultural Fiel-TeluguStop.com

ఈ సందర్భంగా సి.ఐ కిరణ్ కుమార్ మాట్లాడుతూ చందుర్తి మండలం రామన్నపేట గ్రామానికి బెద్రపు నరసింహారెడ్డి, అతని భార్య వార్షిణి ఇద్దరు వారి పొలంలో తేదీ 25-12-2023 రోజున వారి నట్లు వేయగా వారి సరిపోక అదే గ్రామానికి చెందిన పక్క పొలం వారు అయిన తిప్పని రాజయ్య s/o రామయ్య వల్ల దగ్గర అందజ మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో వారి నాట్ల కోసం అడుగగా రాజయ్య ఇస్తా అని చెప్పడంతో నరసింహారెడ్డి, వార్షిణి ఇద్దరు రాజయ్య పొలం వద్దకు వెళ్లగా రాజయ్య పొలం చుట్టూ ఏర్పటు చేసుకున్న విద్యుత్ తీగలు నరసింహారెడ్డి కాలుకు తగిలి గాయాలు కావడం జరుగుతుంది.

అక్కడే ఉన్న నరసింహారెడ్డి భార్య వార్షిణి పక్కనే ఉన్న చింతల దేవయ్య కి పరుగెత్తి వెళ్లి చెప్పగా వెంటనే ట్రాన్స్ఫార్మర్స్ నిలిపివేసి, నరసింహారెడ్డి ని ఆసుపత్రికి తరలించడం జరిగింది నరసింహారెడ్డి చందుర్తి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసి రాజయ్య ను అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండ్ కి తరలించడం జరిగింది.ప్రజలకు విజ్ఞప్తి.

వ్యవసాయ పొలాల వద్ద, అటవీ జంతువుల కోసం విద్యుత్ తీగలు మార్చి ప్రజల ప్రాణాలకు, వన్యప్రాణుల ప్రాణాలకు కారణం అవుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని,

ఇటీవల కాలంలో కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామం, రుద్రంగి మండల మానాల గ్రామ శివారుణ కొంతమంది వన్యప్రాణుల కోసం ఏర్పర్చిన కరెంటు తీగలకు ఇద్దరు వ్యక్తులు మరణించినారు.దీనికి సంబంధించి వీరిపై కేసు నమోదు చేసి పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించడం జరిగింది.

కాబట్టి ప్రజలు కానీ మరియు వేటగాళ్లు గాని వన్యప్రాణులు కొరకు కరెంట్ తీగలు ఏర్పాటు చేయడం, మరియు వన్యప్రాణుల ప్రాణాలు తీయడం కూడా చట్టరీత్యా నేరం.కావున ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

సి.ఐ వెంబడి ఎస్.ఐ రాజేష్, సిబ్బంది ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube