ఇటీవల బీజింగ్ సబ్వే 10వ లైన్‌లో( Line 10 of the Beijing Subway ) ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.ఓ వృద్ధుడు యువతితో వాగ్వివాదానికి దిగాడు.
ఆమెపై చేయి చేసుకున్నాడు.వీరి మధ్య గొడవ తీవ్ర స్థాయికి చేరుకున్నాక పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
ఈ సంఘటన వీడియో తీయగా, ఇప్పుడు అది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
వృద్ధుడు( old man ) తాను కూర్చోవడానికి యువతిని సీటు ఖాళీ చేయమని అడిగాడు.కానీ ఆమె ఇతరులకు ఇస్తానని, కానీ తనకి ఇవ్వనని చెప్పింది.దీంతో ఆ వృద్ధుడు కోపంగా అరుస్తూ కర్రతో ఆమెను కొట్టాడని బీజింగ్ పోలీసులు తెలిపారు.
వైరల్ అవుతున్న వీడియోలో, వృద్ధుడు తన కర్రతో యువతి కాళ్ల మధ్య కొట్టాడు.ఆమె ఎందుకు సీటు ఇవ్వడం లేదో చెప్పాలని నిలదీశాడు.“నేను నిన్ను వృద్ధుల కోసం సీటు ఖాళీ చేయమని బలవంతం చేయడం లేదు” అని చెబుతూనే, అతడు ఆమె వైపు చేయి చూపించి, నెట్టాడు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారినప్పుడు, ఆ వృద్ధుడు మళ్లీ తన ఊతకర్రను యువతి కాళ్ల దగ్గరకు తోశాడు.“పోలీసులను పిలువు,” అని ఆమెను సవాల్ విసిరాడు.పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, నేను నిన్ను వేధించానని ఫిర్యాదు చేయొచ్చు కదా అని కోపంగా అన్నాడు.
అప్పుడు సబ్‌వే సెక్యూరిటీ వాళ్ళు వచ్చి, వారి మధ్య జరిగే గొడవను శాంత పరచడానికి ప్రయత్నించారు.ఈ ఘటన జూన్ 24వ తేదీ జరిగిందని తెలుస్తోంది.దీని వీడియో చూసిన చాలా మంది సోషల్ మీడియాలో ఆ వృద్ధుడి ప్రవర్తనను తప్పుబట్టారు.అతను చాలా అవమానకరంగా ప్రవర్తించాడని, కోపాన్ని తగ్గించుకోవాలని విమర్శించారు.