నాగ్ అశ్విన్( Nag Ashwin ) దర్శకత్వంలో ప్రభాస్( Prabhas ) హీరోగా నటించిన తాజా చిత్రం కల్కి.( Kalki ) తాజాగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా రికార్డుల మోత మోగిస్తూ దూసుకుపోతోంది.ఇప్పటికే ఈ సినిమా కాదాపుగా 700 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు 1000 కోట్ల దిశగా ఈ సినిమా సాగుతూ దూసుకుపోతోంది.సినిమా విడుదల అయ్యి దాదాపు వారం రోజులు కావస్తున్నా కూడా థియేటర్ల వద్ద సందడి తగ్గడం లేదు.
ఈ సినిమాకు హిట్ టాక్ రావడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.మైథాలజీ మరియు సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ లను కలగలిపి తీసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది.ఈ సినిమా విడుదల అయ్యి మంచి విజయం సాధించడంతో చిత్ర బంధం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ సక్సెస్ నీ ఎంజాయ్ చేస్తున్నారు.అందులో భాగంగానే తాజాగా ఈ సినిమా గురించి దర్శకుడు నాగ్ అశ్విన్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మహా భారతం( Maha Bharatam ) కథ గురించి ప్రస్తావిస్తూ, దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి( SS Rajamouil ) ఈ కథకు పర్ఫెక్ట్ ఛాయిస్ అని తెలిపారు అశ్విన్.రాజమౌళి చాలా అద్భుతంగా తీస్తారు అని తెలిపారు.ఈ చిత్రంలో గెస్ట్ రోల్స్ లో నటించిన విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ లో పాత్రలు కూడా మరింత ఎక్కువ నిడివి తో ఉండేలా చేయవచ్చు అని తెలిపారు.ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.