తాజాగా ప్రభుత్వ పాఠశాలలో రేషన్ బియ్యం( Ration rice ) బస్తాలను దించుకోవద్దని చెప్పిన ఉపాధ్యాయుడిపై ఓ రాజకీయ నేత రేషన్ డీలర్ విజయభాస్కర్ ( Dealer Vijaya Bhaskar )ఉపాధ్యాయుడును బండబూతులు తిడుతూ రెచ్చిపోయాడు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ వీడియోలో ఓ వ్యక్తి పాఠశాలలో ఉపాధ్యాయుడిని ఘోరంగా తిట్టడం సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.కర్నూలు జిల్లాలోని కొలమిగుండ్ల మండలం కోర్నపల్లెలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.
ప్రభుత్వ పాఠశాలలో రేషన్ బియ్యం బస్తాలని దించవద్దని., అలా చేయడం ద్వారా విద్యార్థులకు( students ) ఇబ్బంది కలుగుతుందని చెప్పిన ఓ పాఠశాల టీచర్ పై ఓ రేషన్ డీలర్ బూతులు తిడుతూ రెచ్చిపోయాడు.ఎలా పడితే అలా బండ బూతులు తిడుతూ ఉపాధ్యాయుడుని ఘోరంగా అవమానించాడు.
పాఠశాలలో ఎందుకు బియ్యం పెట్టకూడదు.అంటూ టీచర్ను ఆ డీలర్ నోటికి వచ్చినట్లుగా తిట్లు తిట్టాడు.
ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.
వీడియో గమనించినట్లయితే. రేషన్ డీలర్ టీచర్ తో.” ఎవడు.ఎంఈఓ.లోఫర్ నా కొడకా.” మాకు 164 సీట్లు వచ్చాయి.మర్యాద ఇవ్వడం నేర్చుకో నువ్వు అంటూ.
కాస్త గట్టిగానే స్టోర్ బియ్యం బడిలో దించుతాం.ఇక్కడ ఉండకపోతే నువ్వు వెళ్ళిపోవచ్చు అంటూ డీలర్ విజయభాస్కర్ పాఠశాల టీచర్ ను ఇష్టం వచ్చినట్లు తిట్టాడు.
దాంతో ఆ ఉపాధ్యాయుడు తలదించుకొని కన్నీళ్లు పెట్టుకున్నట్టుగా కనబడుతుంది.ఇక ఈ వీడియో పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాల్సిందే.