ఇటీవల కాలంలో అధిక బరువు సమస్య( Overweight Problem )తో సతమతం అవుతున్న వారి సంఖ్య భారీగా పెరిగిపోతుంది.బరువు పెరగడం వల్ల శరీర ఆకృతి మారడమే కాదు ఎన్నో అనారోగ్య సమస్యలకు చేరువవుతున్నట్లు కూడా అవుతుంది.
అందుకే బరువు తగ్గడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే బెల్లం టీ( Jaggery Tea )ను మీరు కచ్చితంగా తాగాల్సిందే.ఈ టీ వెయిట్ లాస్ కు చాలా అద్భుతంగా తోడ్పడుతుంది.
అదే సమయంలో మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.మరి ఇంతకీ ఆ బెల్లం టీను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో వన్ టేబుల్ స్పూన్ టీ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ అల్లం తురుము, అంగుళం దాల్చిన చెక్క, రెండు దంచిన యాలకులు, పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి( Pepper Powder ) వేసి పది నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్లు బెల్లం పొడి వేసి మరో రెండు నిమిషాల పాటు మరిగిస్తే మన బెల్లం టీ సిద్ధం అవుతుంది.

ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో టీ ను ఫిల్టర్ చేసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి.రోజు ఉదయం ఈ బెల్లం టీను తాగితే చాలా ప్రయోజనాలు పొందుతారు.ముఖ్యంగా ఈ బెల్లం టీ మన మెటబాలిజం రేటు( Metabolism ) పెంచడానికి అద్భుతంగా సహాయపడుతుంది.
మెటబాలిజం రేటు పెరిగితే క్యాలరీలు కరిగే వేగం పెరుగుతుంది.దాంతో త్వరగా బరువు తగ్గుతారు.
అలాగే ఈ బెల్లం టీను నిత్యం తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు బాన పొట్ట మాయం అవుతుంది.బెల్లంలో ఉండే ఐరన్ రక్తహీనత( Anemia ) దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకట్ట వేస్తుంది.
జలుబు దగ్గు వంటి సమస్యలు ఏమైనా ఉన్న సరే ఈ బెల్లం టీతో దూరం అవుతాయి.
.






