నేడు కాంగ్రెస్ లో చేరిపోతున్న కేకే 

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీలోకి చేరికల జోరు పెరిగింది.  బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు .

 Kancherla Keshava Rao Is Joining Congress Today Congress, Brs Telngana Cm, Kan-TeluguStop.com

ఇప్పటికే చాలామంది నేతలు చేరిపోయారు.దాదాపు 5 మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిపోయారు.

  కేసీఆర్ కు అత్యంత సన్నిహితులైన వారిగా గుర్తింపు పొందిన వారు కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తూ ఉండడంతో,  బీ ఆర్ ఎస్( BRS party )  పరిస్థితి రోజురోజుకు బలహీనం అవుతున్నట్టుగావే కనిపిస్తోంది.తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి సైతం చేరికలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు .ఇతర పార్టీలోని అసంతృప్తులను , కీలక నేతలను కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు ఆపరేషన్ ఆకర్ష్ కు శ్రీకారం చుట్టారు.  బీఆర్ఎస్ లో కీలక నేతగా కెసిఆర్ కు అత్యంత సన్నిహితుడుగా గుర్తింపు పొందిన రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు కాంగ్రెస్ లో చేరేందుకు నిర్ణయించుకున్నారు.

Telugu Brs, Brs Telngana Cm, Priyanka Gandhi, Rahul Gandhi, Telangana, Telangana

ఈ మేరకు ఏఐసీసీ సంస్థాగత  వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ను కేశవరావు కలిశారు.కేకేతో ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ( Priyanka Gandhi ) ఫోన్ చేసి మాట్లాడారు .ఈరోజు ఢిల్లీలో ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే తో  రేవంత్ రెడ్డి( Revanth Reddy ) భేటీ తరువాత సాయంత్రం ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  చేతుల మీదుగా,  సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కేకే కాంగ్రెస్ కండువా కప్పులోనున్నారు.  వాస్తవంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత రేవంత్ రెడ్డితో కేకే భేటీ అయ్యారు.

  ఆ తరువాత కేకేతో పాటు , ఆమె కుమార్తె హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు.

Telugu Brs, Brs Telngana Cm, Priyanka Gandhi, Rahul Gandhi, Telangana, Telangana

మే నెలలోనే విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరిపోగా ,  కేకే ( Kancherla Keshava Rao ) ఇంకా వేచి చూసే ధోరణిని ఆలంబిస్తూ వస్తున్నారు.ఇప్పుడు ఏఐసిసి పెద్దల సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరబోతున్నారు.ప్రస్తుతం తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన హడావుడి జరుగుతోంది.

  ఈ రోజు సాయంత్రం మల్లికార్జున ఖర్గే తో రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు .ఈ భేటీలో మంత్రి వర్గ విస్తరణ,  కొత్త పిసిసి అధ్యక్షుడు నియామకం నామినేటెడ్ పదవుల పైన కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు.ఈ సమయంలోనే కాంగ్రెస్ కండువా కప్పుకోబోతుండడంతో ఆయనకు ఏదైనా పదవిని కాంగ్రెస్ పెద్దలు ఆఫర్ చేశారా ,? అందుకే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube