నేడు కాంగ్రెస్ లో చేరిపోతున్న కేకే 

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీలోకి చేరికల జోరు పెరిగింది.

  బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు .

ఇప్పటికే చాలామంది నేతలు చేరిపోయారు.దాదాపు 5 మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిపోయారు.

  కేసీఆర్ కు అత్యంత సన్నిహితులైన వారిగా గుర్తింపు పొందిన వారు కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తూ ఉండడంతో,  బీ ఆర్ ఎస్( BRS Party )  పరిస్థితి రోజురోజుకు బలహీనం అవుతున్నట్టుగావే కనిపిస్తోంది.

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి సైతం చేరికలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు .

ఇతర పార్టీలోని అసంతృప్తులను , కీలక నేతలను కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు ఆపరేషన్ ఆకర్ష్ కు శ్రీకారం చుట్టారు.

  బీఆర్ఎస్ లో కీలక నేతగా కెసిఆర్ కు అత్యంత సన్నిహితుడుగా గుర్తింపు పొందిన రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు కాంగ్రెస్ లో చేరేందుకు నిర్ణయించుకున్నారు.

"""/" / ఈ మేరకు ఏఐసీసీ సంస్థాగత  వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ను కేశవరావు కలిశారు.

కేకేతో ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ( Priyanka Gandhi ) ఫోన్ చేసి మాట్లాడారు .

ఈరోజు ఢిల్లీలో ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే తో  రేవంత్ రెడ్డి( Revanth Reddy ) భేటీ తరువాత సాయంత్రం ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  చేతుల మీదుగా,  సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కేకే కాంగ్రెస్ కండువా కప్పులోనున్నారు.

  వాస్తవంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత రేవంత్ రెడ్డితో కేకే భేటీ అయ్యారు.

  ఆ తరువాత కేకేతో పాటు , ఆమె కుమార్తె హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు.

"""/" / మే నెలలోనే విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరిపోగా ,  కేకే ( Kancherla Keshava Rao ) ఇంకా వేచి చూసే ధోరణిని ఆలంబిస్తూ వస్తున్నారు.

ఇప్పుడు ఏఐసిసి పెద్దల సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరబోతున్నారు.ప్రస్తుతం తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన హడావుడి జరుగుతోంది.

  ఈ రోజు సాయంత్రం మల్లికార్జున ఖర్గే తో రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు .

ఈ భేటీలో మంత్రి వర్గ విస్తరణ,  కొత్త పిసిసి అధ్యక్షుడు నియామకం నామినేటెడ్ పదవుల పైన కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు.

ఈ సమయంలోనే కాంగ్రెస్ కండువా కప్పుకోబోతుండడంతో ఆయనకు ఏదైనా పదవిని కాంగ్రెస్ పెద్దలు ఆఫర్ చేశారా ,? అందుకే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయ.

తలనొప్పిగా ఉన్నప్పుడు అస్సలు చేయకూడని తప్పులు ఇవే!