ప్రపంచంలోనే అత్యంత పొడవైన సైకిల్.. చూస్తే అవాక్కవుతారు...

నెదర్లాండ్స్‌కు( Netherlands ) చెందిన 8 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్‌ 180 అడుగుల 11 అంగుళాల పొడవుతో ప్రపంచంలోనే అతిపెద్ద సైకిల్‌ను క్రియేట్ చేశారు.అంతేకాదు విజయవంతంగా దానిని నడిపిస్తూ కొత్త రికార్డు సృష్టించారు.2020లో ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తి సృష్టించిన 155 అడుగుల 8 అంగుళాల పాత రికార్డును వీళ్లు బ్రేక్ చేశారు.ఈ బృందానికి నాయకత్వం వహించిన 39 ఏళ్ల ఐవాన్ ష్చాల్క్( Ivan Schalk ) చిన్నప్పటి నుంచే ఈ రికార్డును బద్దలు కొట్టాలని కలలు కన్నాడు.గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్( Guinness World Record ) పుస్తకం అతనికి స్ఫూర్తినిచ్చింది.

 Worlds Longest Bicycle Built By A Dutch Team Viral Details, Ivan, Dutch Engineer-TeluguStop.com

60 ఏళ్లకు పైగా ఇలాంటి భారీ సైకిల్‌ను( Longest Bicycle ) నిర్మించే ఆలోచన ఉంది.1965లో జర్మనీలోని కోలోన్‌లో 8 మీటర్ల (26 అడుగులు 3 అంగుళాలు) పొడవుతో మొదటి రికార్డు నమోదైంది.గత దశాబ్దాలలో న్యూజిలాండ్, ఇటలీ, బెల్జియం, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌లకు చెందిన వ్యక్తులు, బృందాలు ఈ రికార్డును సొంతం చేసుకున్నాయి.ఐవాన్ అనే వ్యక్తికి కర్ణావల్ ఫ్లోట్ల నిర్మాణంలో అనుభవం ఉంది.2018లో అతను ఈ భారీ సైకిల్ ప్రాజెక్ట్‌ను ప్రణాళిక చేయడం ప్రారంభించాడు.టెక్నికల్ స్కిల్, స్వచ్ఛంద సేవా భావనకు పేరుగాంచిన ప్రిన్సెన్బీక్ గ్రామం నుంచి టీమ్‌ సభ్యులను నియమించుకున్నాడు.

Telugu Bicycle, Dutch, Guinness, Ivan, Ivan Schalk, Longestrideable, Worldslonge

ప్రజల టెక్నికల్ స్కిల్స్ ఉపయోగించి సాహసోపేత ప్రాజెక్ట్‌లను పూర్తి చేయగలమని ఐవాన్ విశ్వసించాడు.అందుకే వారిని అడగగా వారు అందుకు సానుకూలంగా స్పందించారు.భారీ సైకిల్‌ను నిర్మించడానికి టీం సభ్యుల సహకారం, టెక్నికల్ నైపుణ్యం చాలా అవసరం.

ఇది కచ్చితంగా అద్భుతమైన ఘనత, సైకిల్ కూడా పూర్తిగా పనిచేస్తుంది.అయితే, చాలా పొడవుగా ఉండటం వల్ల నగరాల్లో రోజువారీ ఉపయోగంలో ఇది పనికిరాదు.

Telugu Bicycle, Dutch, Guinness, Ivan, Ivan Schalk, Longestrideable, Worldslonge

ఈ ప్రాజెక్ట్ అనేది టీమ్‌ అంకితభావం, ఆవిష్కరణను చాటుతుంది.ఇంజనీరింగ్ పట్ల వారికున్న అభిరుచిని తెలియజేస్తుంది.సామాజిక భావనతో వారు ఒక సాహసోపేత ఆలోచనను రికార్డు బ్రేకింగ్ ఫీట్‌గా మార్చారు.ఈ సైకిల్ కి సంబంధించిన వీడియో చూడడానికి ఈ లింకు https://youtu.be/mx7PRl_y7Q8?si=EHhr7BDSvcqcJTT9పై క్లిక్ చేయవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube