భారత జట్టు దేశానికి తిరిగి రావడానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది.భారత క్రికెట్ జట్టు తమ దేశానికి తిరిగి వస్తుండడంతో దేశప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
తుపాను కారణంగా టీమిండియా బార్బడోస్ లో చిక్కుకుపోయింది.ఈ కారణంగా రోహిత్ అండ్ టీం స్వదేశానికి రావడంలో జాప్యం జరిగింది.
ఇప్పుడు భారత జట్టు( Team India )ను స్వదేశానికి తీసుకొచ్చే విమానం వీడియో తాజాగా బయటకు వచ్చింది.ఎయిర్ ఇండియాకు చెందిన ఈ ప్రత్యేక విమానం బార్బడోస్ చేరుకుంది.
దీని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
జూన్ 29న బార్బడోస్( Barbados )లో జరిగిన టి20 కప్ ఫైనల్ లో దక్షిణాఫ్రికాను 7 పరుగుల తేడాతో ఓడించిన తర్వాత.రోహిత్ శర్మ( Rohit Sharma ) అండ్ భారత క్రికెట్ జట్టు విమానం ఉదయం 6 గంటలకు ఢిల్లీకి చేరుకుంటుంది.భారత క్రికెట్ జట్టుతో పాటు మీడియాతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా బార్బడోస్ లో చిక్కుకుపోయారు.
అందులో దాదాపు 20 మంది ఉన్నారు.వీరిని బిసిసిఐ సెక్రటరీ జై షా బార్బడోస్ నుండి ఢిల్లీకి ప్రత్యేక చార్టర్డ్ ఫ్లైట్‌లో భారత జట్టుతో కలిసి వెళ్లడానికి ఏర్పాట్లు చేసారు.
2024 టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు చరిత్ర సృష్టించి రెండోసారి పొట్టి ప్రపంచ కప్ ను టైటిల్‌ను కైవసం చేసుకుంది.ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది.దీనికి ముందు 2007 టీ20 ప్రపంచకప్‌ను భారత జట్టు గెలుచుకుంది.వన్డేల్లో 1983, 2011 ప్రపంచకప్ లను గెలుచుకుంది.ఈసారి ప్రపంచకప్ గెలిచిన తర్వాత.విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టి20 ఇంటర్నేషనల్ నుండి రిటైర్ అయ్యారు.