తెలుగు ప్రేక్షకులకు సినీ నటి మంత్రి రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన.ఇటీవల కాలంలో రోజా( Roja ) పేరు సోషల్ మీడియాలో మారుమోగుతున్న విషయం తెలిసిందే.ఆమెపై సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు.2014, 2019 ఎన్నికల సమయంలో వరుసగా విజయాలు సాధించిన రోజా ఈసారి కూడా హ్యాట్రిక్ కాయం అనే ధీమాతో బరిలోకి దిగగా దారుణంగా ఓటమిపాలైన విషయం తెలిసిందే.కానీ రోజాకి ఊహించని షాక్ ఇచ్చారు నగరి ప్రజలు.ఎంతసేపు టీపీడీ, జనసేన పార్టీలపై ఆ పార్టీ నేతలపై విరుచుకుపడుతూ నగరి నియోజకవర్గాన్ని అలాగే మమ్మల్ని గాలికి వదిలేశారు అంటూ నగరి ప్రజలు ఆమెపై గుర్రుగా ఉన్నారు.
రెండున్నరేళ్లు మంత్రిగా( Minister ) అధికారంలో ఉన్నా నగరిలో ఎలాంటి అభివృద్ది పనులకు తోడు కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో రోజా దారుణ పరాజయాన్ని మూట గట్టుకున్నారు.సొంత పార్టీ నేతలే ఆమెను ఓడించారని విశ్లేషకులు అంటున్నారు.
ఓటమి ఇచ్చిన షాక్ నుంచి తేరుకోవడానికి రోజా తేరుకోలేకపోయారు.దీనికి తోడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆమెను ప్రత్యేకంగా టార్గెట్ చేసిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
వైసీపీ( YCP ) అధికారంలో ఉన్నన్ని రోజులు చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఇతర కూటమి నేతలపై పరుష పదజాలాన్ని వాడారు.ఈ పరిణామాలతో రోజాను ఎలాగైనా ఓడించాలని విపక్ష నేతలు పట్టుదల ప్రదర్శించారు.
ఇప్పుడు టీడీపీ , జనసేన, బీజేపీ కూటమి చేతుల్లో పవర్ ఉండటంతో గతంలో ఏపీఐఐసీ ఛైర్మన్ , మంత్రిగా రోజా ఉన్న సమయంలో చోటు చేసుకున్న అవినీతిని బయటకు తీస్తున్నారు.ప్రధానంగా ఆడుదాం ఆంధ్ర, సీఎం కప్‌ల పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి.దాదాపు రూ.100 కోట్లు స్కాం జరిగిందని క్రీడా శాఖా మంత్రిగా రోజా, శాప్ మాజీ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డిలు( Byreddy Siddharth Reddy ) అక్రమాలకు పాల్పడ్డారని విమర్శిస్తున్నారు.దీనికి తోడు విశాఖ రుషికొండపై జగన్( Jagan ) ప్రభుత్వం కట్టిన విశాలమైన ప్యాలెస్ విషయంలోనూ రోజా పేరు తెరపైకి వినిపిస్తోంది.ఇదంతా పక్కన పెడితే జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ( Kiraak RP ) రోజాను ఓ ఆట ఆడుకుంటున్న విషయం తెలిసిందే.
ఎన్నికల ప్రచార సమయంలో జబర్దస్త్ నటులపై ఆమె చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చిన ఆర్పీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరింత రెచ్చిపోతున్నారు.
తాజాగా కూడా మరోసారి రెచ్చిపోయి రోజాపై కామెంట్స్ చేశాడు ఆర్పి.ఈ సందర్భంగా ఆర్పీ మాట్లాడుతూ.ఆమె అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ.3000 కోట్లు సంపాదించారు దమ్ముంటే దీనిపై చర్చించేందుకు రావాలంటూ ఆర్పీ సవాల్ కూడా విసిరారు.అనిల్ కుమార్ యాదవ్, పేర్ని నాని, పెద్దిరెడ్డి , మిథున్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిలు వేలకోట్లు సంపాదించారని ఆర్పీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ పాలనలో ఏపీ ఏ శాఖ లోనూ 1 శాతం కూడా అభివృద్ధి జరగలేదని, కానీ టెండర్లు వేసి బిల్లులు తీసేసుకున్నారని ఆయన ఆరోపించారు.మరి కిరాక్ ఆర్పి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.