తాజాగా విమానంలో ప్రయాణికులు ( Passengers on board )ఎదుర్కొంటున్న ఇబ్బందులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న సంగతి అందరికి తెలిసిందే.విమానం గాల్లో ప్రయాణించే సమయంలో ఎమర్జెన్సీ డోర్లు ఊడిపోవడం, ఇంకా విమానం ఇంజిన్ లో మంటలు రావడం లాంటి అనేక ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటున్న విషయం అందరికి తెలిసిందే.
ఈ తరుణంలో తాజాగా విమానం గాల్లో ప్రయాణించే సమయంలో భారీ కుదుపులు సంభవించడంతో ఏకంగా 30 మందికి పైగా గాయపడ్డారు.విమానంలోని ప్రయాణికులంతా ఒక్కసారిగా భయబ్రాంతులకు లోనయ్యారు.
ఈ క్రమంలో ఒక వ్యక్తి ఏకంగా ఓవర్ హెడ్ బిన్( Overhead bin ) లో ఇరుక్కుపోయాడు.ఇందుకు సంబంచింది పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఎయిర్ యూరోపా విమానయాన సంస్థకు చెందిన బోయింగ్ 789-9 విమానం 325 మంది ప్రయాణికులతో స్పెయిన్ నుంచి ఉరుగ్వేకు ప్రయాణం స్టార్ట్ అయింది.ఈ క్రమంలో ఒక్కసారిగా కుదుపులకు మొదలు అయ్యి ఒక్క సారిగా ప్రయాణికులు అందరు ఎగిరెగిరి పడ్డారు.
ఇక పిల్లలైతే ఏడుపులు, కేకలతో విమానంలో అరుపులతో గందరగోళ పరిస్థితి నెలకొంది.దీంతో.బ్రెజిల్ లోని నాటల్ విమానశ్రయంలో ఎమెర్జెన్సీ ల్యాండింగ్ కూడా ఏర్పాటు చేశారు అధికారులు.
ఇక ఈ ఘటనపై ఎయిర్ యూరోపా సంస్థ స్పందిస్తూ.విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని., గాయపడినవారికి చికిత్స అందిస్తున్నామని తెలిపారు.
అలాగే ప్రయాణికులను అందరికి కూడా వారి డెస్టినేషన్ కు తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.