ఎముకలు( Bones ).మన శరీరంలో ముఖ్య పాత్రను పోషిస్తాయి.
మన బాడీ మొత్తం ఎముకల పైన ఆధారపడి ఉంటుంది.ఎముకలు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము.
అన్ని పనుల్లో చురుగ్గా పాల్గొంటాము.అందుకే ఎముకల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధను వహించాలి.
ముఖ్యంగా ఎముకలకు మేలు చేసే ఆహారాలను డైట్ లో చేర్చుకోవడమే కాదు హాని చేసే ఆహారాలతో జాగ్రత్తగా కూడా ఉండాలి.మరి ఇంతకీ ఎముకలకు హాని చేసే ఆహారాలు ఏవేవో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.ఎముకలకు కూడా ప్రోటీన్ ఎంతో అవసరం.
కానీ ప్రోటీన్ మెండుగా ఉండే ఆహారాలను అధికంగా తీసుకుంటే మాత్రం మీ ఎముకలు డేంజర్ లో పడ్డట్టే.హై ప్రోటీన్ ఎముకల ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది.
అందుకే శరీరానికి ఎంత అవసరమో అంతే ప్రోటీన్ అందించాలి.

అలాగే ఆకుకూరల్లో ఒకటి అయిన బచ్చలి కూర అనేక పోషకాలు కలిగి ఉంటుంది.అందువల్ల బచ్చలి కూర బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది.కానీ బచ్చలి కూరలో ఆక్సలేట్ అనేది అధికంగా ఉంటుంది.
అందువల్ల ఈ ఆకుకూరను అధికంగా తీసుకుంటే కాల్షియం శోషణకు ఆటంకం కలుగుతుంది.ఫలితంగా ఎముకలు బలహీనంగా మారతాయి.
అందుకే బచ్చలి కూరను తక్కువగా తీసుకోవాలి.

ఎముకలకు హాని చేసే వాటిలో కెఫిన్ ఒకటి.కెఫిన్( Caffeine ) కూడా బాడీ కాల్షియంను గ్రహించకుండా అడ్డుకుంటుంది.అందుకే కెఫిన్ ఉండే ఆహారాలను వీలైనంతవరకు తక్కువగా తీసుకోవాలి.
ఇక ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా క్యాల్షియం లోపం తలెత్తే అవకాశం ఉంది.ఉప్పులో ఉండే సోడియం కంటెంట్ క్యాల్షియాన్ని క్షీణించేలా చేస్తుంది.
దీంతో ఉప్పు ఎక్కువగా తీసుకుంటే ఎముకల్లో సాంద్రత తగ్గిపోతుంది.చిన్న చిన్న దెబ్బలకు కూడా ఎముకలు విరగడం, చిట్లడం వంటివి జరుగుతున్నాయి.
కాబట్టి, తీసుకుంటే ఆహారంలో ఉప్పు తక్కువగా ఉండేలా చూసుకోండి.