కేంద్రం నిధులతోనే ఏపీలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు.రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు.
నెల్లూరులో రూ.102 కోట్లతో రైల్వేస్టేషన్ ను కేంద్రం నవీకరిస్తోందని పురంధేశ్వరి వెల్లడించారు.ఈ క్రమంలో రైల్వేస్టేషన్ రూపు రేఖలు పూర్తిగా మారుస్తున్నామని తెలిపారు.ఏపీని డెవలప్ చేయడానికి కేంద్రం అత్యధిక ప్రాధాన్యతను ఇస్తోందని వెల్లడించారు.