తెలుగు సినిమా పరిశ్రమలో పీపుల్స్ స్టార్ గా ముద్రపడిన నటుడు ఆర్ నారాయణ మూర్తి. ఆయన సినిమాలన్నీ ప్రజా సమస్యలే కథాంశాలుగా తీసుకుని తెరకెక్కించబడుతాయి.
ఆయన తీసిన అనేక సినిమాలు.అనేక సమస్యలను ప్రతిబింబించాయి.
సినిమా పరిశ్రమలో ఉన్నత విలువలు.గ్లామర్ ప్రపంచంలో సాదాసీదా ప్రయాణం తన ప్రత్యేకతలు.
నేరము-శిక్ష సినిమాతో తెరంగేట్రం చేసిన నారాయణమూర్తి.నీడ సినిమాతో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు.
ఆ తర్వాత చీవలదండు, ఎర్రసైన్యం సినిమాలతో నిర్మాతగా, దర్శకుడిగా, రచయితగా, సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు పొందాడు.
తాను సినిమా పరిశ్రమలోకి రావడానికి అసలు కారణం లెనిన్ అంటాడు ఆర్ నారాయణమూర్తి.
హాలీవుడ్‌ని ఆర్నెల్లు తనకు అప్పగిస్తే ప్రపంచ చరిత్ర మార్చేస్తానన్న తన మాటలు ఆదర్శం అన్నాడు.సినిమా పవర్ తెలిసిన వ్యక్తిని కాబట్టే ఈ రంగంలోకి వచ్చినట్లు చెప్పాడు.
తన సొంతూరు ఆంధ్రప్రదేశ్‌లోని రౌతులపూడి.అక్కడున్న థియేటర్ నుంచి నిత్యం సినిమా పాటలు వినిపించేది.అప్పుడే తనకు సినిమాల్లో నటించాలనే కోరిక కలిగిందంటారు ఆయన.తన అభిమాన నటులు అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి అని చెప్పాడు నారాయణ మూర్తి.అటు ఎన్టీఆర్, ఎస్వీ రంగారావు, సూర్యకాంతం, రేలంగి నటించిన అన్ని సినిమాలు ఎన్నోసార్లు చూసినట్లు చెప్పారు.

అటు తన సినిమాలకు సెన్సార్ సమస్య బాగా వచ్చేదని చెప్పాడు.లాల్ సలామ్ సినిమా సమయంలో సెన్సార్ తో పాటు పోలీసులు తనను ఇబ్బంది పెట్టారని చెప్పాడు.విప్లవ సినిమాలు చేస్తే ఎన్ కౌంటర్ చేస్తానని అప్పటి ఇంటలిజెన్స్ ఐజీ తనను హెచ్చరించాడని చెప్పారు.
ఆ తర్వాత తన ఉద్దేశం తెలుసుకుని వదిలేశాడని చెప్పారు.దండోరా సినిమాను సారాకు వ్యతిరేకంగా తీసినట్లు చెప్పాడు.
ఆ సినిమా చూసి జనాలు సారా దుకాణాలపై పడి ధ్వంసం చేసినట్లు వెల్లడించారు.

రామోజీరావు తన దండోరా సినిమా చూసి ఆలింగనం చేసుకున్నట్లు చెప్పారు.తన సినిమాలు చూసి కొందరు భూపోరాటాలు చేసినట్లు తెలిపారు.అటు తన తాజా సినిమా రైతన్న సెన్సార్ పూర్తయినట్లు చెప్పాడు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాల వల్ల కలిగే ఇబ్బందులను ఇందులో చూపించినట్లు చెప్పాడు.త్వరలో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చెప్పాడు.