మన దేశం లోని దేవాలయాలలో చాలామంది ప్రజలు ప్రతిరోజు భగవంతునికి పూజలు చేస్తూ ఉంటారు.అలాగే కొంతమంది ప్రజలు ఇంట్లో కూడా పూజలు చేస్తూ ఉంటారు.
ఎన్ని రకాల పూజలు చేసినా ఏ పూజలో అయినా సరే చివరికి నైవేద్యం సమర్పించాల్సిందే.దేవతలు మారుతూ ఉంటే నైవేద్యం కూడా మారుతూ ఉంటుంది.
అసలు దేవుడు తింటాడా.లేకపోతే తినడా? నైవేద్యం ఎందుకు సమర్పించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నైవేద్యం భగవంతుడికి సమర్పిస్తే భగవంతుడు( God ) తినడు కానీ పూజించేవారికి( Devotees ) భగవంతుడి పై ఉన్న కృతజ్ఞత భావాన్ని నైవేద్యం సూచిస్తుంది.ప్రపంచంలో మనిషి బ్రతకడానికి తినే ఆహార పదార్థాలన్నీ ప్రకృతి నుంచి వచ్చినవే.
ప్రకృతిని సృష్టించి జాగ్రత్తగా కాపాడుతున్న ఆ భగవంతునికి మనిషి కృతజ్ఞతాపూర్వకంగా సమర్పించేదే నైవేద్యం అని పండితులు చెబుతున్నారు.మనిషి జీవితం త్యాగభావనలతోనే పరిపూర్ణమవుతుంది.తను అనుభవించడం కన్నా ఇతరులకు పంచడంలోనే ఆనందం ఉంది అన్నది దాని అంతరార్థం.

పూట గడవని నిరుపేద నుంచి కోట్ల రూపాయలు సంపాదించిన వారి వరకు ఎవరి హోదాకు తాగినట్లు నైవేద్యం( Naivedyam ) భగవంతునికి సమర్పిస్తూనే ఉంటారు.భగవంతుడు భక్తితో ఏమిచ్చినా తీసుకునేందుకు భక్త శబరి, భక్తకన్నప్పలే నిదర్శనం.వాస్తవానికి భగవంతుడు దృష్టి ఉంచిన ప్రతి పదార్థం అమృతమయమే.
అందుకే గమనిస్తే ఇంట్లో ఎంత శ్రద్ధగా చేసిన ఆ రుచి రాదు.కానీ ఆలయంలో( Temple ) స్వామి, అమ్మవార్లకు సమర్పించిన తర్వాత తీసుకునే ఆ ప్రసాదం ఎంతో రుచిగా ఉంటుంది.
అందుకే చాలామంది గుడిలో పులిహారలా లేదు, దేవాలయం లో పంచే దద్దోజనంలా లేదని దానికి కారణం అదే అని చెబుతూ ఉంటారు.

మనిషి అనే వాడు అన్నం తినే ప్రతిసారి ఇది నేను సంపాదించినది అన్న అహంకారం ఉంటుంది.కానీ భగవంతుడికి దాన్ని అర్పించాక తినడం వల్ల అహంకారం తగ్గి అది భగవంతుడి అనుగ్రహం అన్న ఆలోచన వస్తుంది.నైవేద్యం కోసం తయారు చేసే ఆహారాన్ని రుచి చూడకూడదని ఎందుకు చెబుతారంటే ఆహారాన్ని కేవలం రుచి కోసం కాకుండా ఒక పవిత్ర యజ్ఞంగా భావించమని వేద పండితులు చెబుతూ ఉంటారు.
ఇంకా చెప్పాలంటే ఎప్పుడు కూడా ఆహారాన్ని వృధా చేయకూడదని దీనిలో అర్థం ఉంది.ఎందుకంటే ఎంతోమంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఆకలితో చనిపోతున్నారు.