యాదాద్రి భువనగిరి జిల్లా: సీనియర్ సివిల్ జడ్జిలుగా ప్రమోషన్ పొందిన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ప్రదీప్,ఎస్.చందనలకు అడ్వకేట్స్ మరియు కోర్టు సిబ్బంది శుక్రవారం రామన్నపేట కోర్టు ప్రాంగణంలో ఘనంగా సన్మానించారు.
అనంతరం ప్రిన్సిపల్ జూనియర్ ఏ ప్రదీప్, అడిషనల్ జూనియర్స్ చందనా మాట్లాడుతూ ఇన్ని రోజులు ఎంతగానో సహకరించిన అడ్వకేట్ మరియు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.కృషి ఉంటే ఎంతటి సమస్యనైనా సాధించవచ్చని,
పనిని దైవంగా భావించి పట్టుదలతో కృషి చేయడం ద్వారా ఫలితాన్ని సాధించవచ్చని అన్నారు.
ఈకార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండి మజీద్, సీనియర్ అడ్వకేట్స్ యాపాల కృష్ణారెడ్డి, కంపాటి యాదగిరి,అశోక్ కుమార్,నరేంద్ర రావు, బార్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్ గాలి లింగయ్య, సత్తయ్య,మామిడి వెంకట్ రెడ్డి,శ్రవణ్ కుమార్, అడ్వకేట్స్ జినుకల ప్రభాకర్,శోభన్ బాబు, అశోక్ కుమార్,పాల్వంచ జగతయ్య,డేవిడ్, నకిరేకంటి మొగులయ్య, యాదాసు యాదయ్య, కొండూరు బాలరాజు,ఎస్.బాలరాజు,శ్రీశైలం,దినేష్, స్వామి,రమేష్,అజీజ్,రెండు కోర్టుల సూపరిండెంట్లు నారగోని గంగాభవాని,బాలగోని శివరాజు మరియు సిబ్బంది పాల్గొన్నారు.







