యాదాద్రి భువనగిరి జిల్లా: రామన్నపేట మండలం తుర్కపల్లి ఏటి పరివాహక ప్రాంతం నుండి అక్రమంగా తరలిస్తున్న నాలుగు ఇసుక ట్రాక్టర్లను రామన్నపేట పోలీసులు కక్కరేని మూసి బ్రిడ్జిపై రెక్కీ నిర్వహించి చాకచక్యంగా పట్టుకున్నారు.పోలీసుల నుండి తప్పించుకునే ప్రయత్నం చేయగా వెంబడించి అదుపులోకి తీసుకున్నారు.
అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇసుక మాఫియాను పోలీసులు
రామన్నపేట పోలీస్ స్టేషన్లో అప్పగించి నాలుగు ట్రాక్టర్లను సీజ్ చేయడం జరిగిందని రామన్నపేట ఎస్సై పి.మల్లయ్య ఒక ప్రకటనలో తెలియజేశారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణాకు రాత్రి వేళలో పగటివేలలో ఎవరు అక్రమ రవాణాకు పాల్పడినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, పట్టుబడి చేసిన టాక్టర్ డ్రైవర్లపై ఓనర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని అన్నారు.