హెల్త్ మరియు ఫిట్ నెస్ పై శ్రద్ధ వహించే వారు ఖచ్చితంగా తమ డైట్ లో ఓట్స్ ను చేర్చుకుంటూ ఉంటారు.ఓట్స్ లో పోషకాలు ఎక్కువగా కేలరీలు తక్కువగా ఉంటాయి.
అందుకే అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయి.
అయితే ముఖ్యంగా ఓట్స్ ను బ్రేక్ ఫాస్ట్ లో ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ ను తమ సొంతం చేసుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఓట్స్ ను ఎలా తీసుకోవాలో ఓ చూపు చూసేయండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల ఓట్స్ ను వేసి ఫ్రై చేసుకుని పెట్టుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఒకటిన్నర గ్లాస్ హోమ్ మేడ్ బాదం పాలను పోసుకోవాలి.
అలాగే అందులో వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్, వేయించి పెట్టుకున్న ఓట్స్, ఐదు నుంచి ఎనిమిది నల్ల ఎండు ద్రాక్షలు, వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ పెరుగు, పావు టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసుకొని స్పూన్ తో బాగా మిక్స్ చేసి మూత పెట్టి నైటంతా నానబెట్టుకోవాలి.

మరుసటి రోజు ఉదయం ఓట్స్‌లో నాలుగు గంటల పాటు నీటిలో నానపెట్టిన గుమ్మడి గింజలు రెండు టేబుల్ స్పూన్లు, సన్నగా తరిగిన యాపిల్ ముక్కలు అర కప్పు, రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసుకుని కలిపితే హెల్తీ అండ్ టేస్టీ ఓవర్ నైట్ ఓట్స్ తయారవుతుంది.ఈ ఓట్స్ రెసిపీని ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారు.గుండె జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.
నీరసం, అలసట వంటివి దూరం అవుతాయి.శరీరం ఎనర్జిటిక్ గా మారుతుంది.
ఎముకలు, కండరాలు దృఢంగా మారుతాయి.మరియు మెదడు పనితీరు సైతం మెరుగ్గా సాగుతోంది.