మీ ముఖం తెల్లగా మృదువుగా ఉన్నా మెడ మాత్రం నల్లగా అసహ్యంగా కనిపిస్తోందా.? మెడ నలుపును వదిలించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు ప్రయోగాలు చేస్తున్నారా.? వైట్ అండ్ బ్రైట్ నెక్ ను కోరుకుంటున్నారా..? అయితే ఇప్పుడు చెప్పబోయే వండర్ ఫుల్ హోమ్ రెమెడీ మీకు చాలా బాగా సహాయపడుతుంది.ఈ రెమెడీని కనుక పాటిస్తే కొద్ది రోజుల్లోనే మీ మెడ నలుపు వదిలిపోతుంది.
అందుకోసం ముందుగా బాగా పడిన ఒక టమాటో ను తీసుకొని వాటర్ తో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఒక నిమ్మ పండును కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు, నిమ్మ పండు ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్( Coffee Powder ), హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు( Turmeric ) వేసుకోవాలి.
చివరిగా సరిపడా టమాటో లెమన్ ప్యూరీ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మెడకు అప్లై చేసకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
ఆపై తడి వేళ్ళతో మెడను సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఫైనల్ గా మంచి మాయిశ్చరైజర్ ను మెడకు అప్లై చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ సింపుల్ అండ్ పవర్ ఫుల్ హోమ్ రెమెడీని కనుక పాటిస్తే మెడ నలుపు క్రమంగా వదిలిపోతుంది.మెడపై పేరుకు పోయిన మురికి మృత కణాలు తొలగిపోతాయి.
కొద్ది రోజుల్లోనే మీ నెక్ వైట్ అండ్ బ్రైట్ గా మారుతుంది.అందంగా మెరుస్తుంది.