ఈ రైల్వే స్టేషన్లలో దెయ్యాల జాడలు.. రుజువులు చూపిస్తున్న సిబ్బంది!

దెయ్యాల ప్రపంచం గురించి మీరు చాలా కథలు వినేవుంటాడు.ఇలాంటి ప్రదేశాలు, భవనాల గురించి కూడా ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటారు.

 Railway Stations Of The World Are Haunted By Ghosts Details, Haunted Railway Sta-TeluguStop.com

దెయ్యం అనేదేమీ లేదని సైంటిస్టులు చెబుతున్నప్పటికీ అయినప్పటికీ, చాలామంది ఇప్పటికీ దెయ్యాలను నమ్ముతారు.వాటి గురించి తెలుసు కోవాలను కుంటారు.

ఈ కోవలోనే ప్రపంచంలోని కొన్ని రైల్వే స్టేషన్లలో దెయ్యాలు ఉన్నాయని స్థానికులు చెబుతుంటారు.ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

షాంఘై సబ్‌వే స్టేషన్

చైనాలోని షాంఘై సబ్‌వే స్టేషన్ దెయ్యాల స్టేషన్‌గా పేరొందింది.ఇక్కడికి వచ్చే రైళ్లు అకస్మాత్తుగా చెడి పోతుండటంతో ఇక్కడ దెయ్యాలు ఉన్నాయని చెబుతారు.  ఇక్కడి ప్రజలు దెయ్యాల నీడను చూశామని చెబుతుంటారు.

పాంటోన్స్ స్టేషన్

ఇది కాకుండా, మెక్సికో సిటీలో ఉన్న పాంటోన్స్ స్టేషన్ కూడా ఘోస్ట్ స్టేషన్లలో ఒకటని  చెబుతారు.నిజానికి పాంటోన్స్ స్టేషన్ సమీపంలో 2 శ్మశానాలు ఉన్నాయి.ఇక్కడ అకస్మాత్తుగా అదృశ్యమైన కొంత మంది వ్యక్తుల నీడలు కనిపించాయి.ఇది కాకుండా ఇక్కడి సొరంగాలు, గోడల నుండి అరుపుల శబ్దం వినిపిస్తుంది.

Telugu Railway, Makwarifield, Shangai-Latest News - Telugu

యూనియన్ స్టేషన్

యూఎస్ఏలోని ఫీనిక్స్‌లో ఉన్న యూనియన్ స్టేషన్ గురించి కూడా ఇలాంటి కథలు వినిపిస్తుంటాయి.ఈ స్టేషన్‌ను 1995లో ప్రభుత్వ మూసి వేసింది.ఇక్కడ ఒక దెయ్యం ఉంటుంది.దీనిని స్థానికులు ఫ్రెడ్ అని పిలుస్తారు.

గ్లెన్ ఈడెన్ రైల్వే స్టేషన్

న్యూజిలాండ్‌ లోని గ్లెన్ ఈడెన్ రైల్వే స్టేషన్ హాంటింగ్ స్టేషన్‌కు కూడా పేరుగాంచింది.మృతదేహాలను ఇళ్లకు చేర్చేందుకు ఈ స్టేషన్‌ను ప్రారంభించారు.ఇక్కడ ఒక కేఫ్‌ కూడా ఉంది.ఇక్కడ దెయ్యం నీడలు కనిపిస్తాయని చెబుతారు.

Telugu Railway, Makwarifield, Shangai-Latest News - Telugu

మాక్వారీ ఫీల్డ్స్ రైలు స్టేషన్

ఆస్ట్రేలియాలోని మాక్వారీ ఫీల్డ్స్ రైల్వే స్టేషన్‌లో ఓ దెయ్యం తిరుగుతున్నదని చెబుతారు.ఆ దెయ్యం కేకలు వేయడం కొంతమంది స్థానికులు చెబుతుంటారు.

అడిస్కోంబ్ రైల్వే స్టేషన్

బ్రిటన్‌లోని అడిస్కోంబ్ రైల్వే స్టేషన్ 1906లో రెండు చెక్క కౌంటర్లతో ప్రారంభించారు.రైలు డ్రైవర్ నీడ ఇక్కడ కనిపిస్తుంటుందని స్థానికులు చెబుతుంటారు.ఈ స్టేషన్‌ను 2001 సంవత్సరంలో కూల్చివేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube