వైరల్ వీడియో: పట్టుకోబుతుండగా ఒక్కసారిగా మనిషిని కాటేసిన పాము.. చివరికి..

సోషల్ మీడియా( Social media )లో పాములకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతుండడం చూసే ఉంటాము.నిజానికి మనలో చాలామంది పామును చూస్తే చాలు ఒకసారిగా భయపడి పోయి అక్కడ నుంచి పరిగెత్తుతాము.

 Viral Video: A Snake That Bit A Man While Being Caught In The End Viral Video,-TeluguStop.com

అలాంటిది కొంతమంది మాత్రం వాటిని పట్టుకొని సుదూర ప్రాంతాల్లో వదిలేయడానికి ఎంతో సాహసం చేస్తారు.అలాగే మరికొందరు విదేశాలలో పాముని పెంపుడు జంతువుల లాగా పెంచుకునే వారు కూడా లేకపోలేదు.

ఇక స్నేక్ క్యాచర్ లాంటి వాళ్ళు పాములను ఎంతో చాకచక్యంగా పట్టుకొని వాటిని జన ప్రాంతాలలో నుండి సుదూర ప్రాంతాలలో వదిలిపెడుతుంటారు.తాజాగా ఇలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే ఈ సంఘటనలో పాము ఉన్నటువంటి స్నేక్ క్యాచర్ ను కాటేసింది.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అయింది.

ఈ వీడియో గురించి పూర్తి వివరాలు చూస్తే.

స్నేక్ క్యాచర్( Snake Catcher ) కు ఓ ప్రాంతంలో పాము సంచరిస్తుందని విషయం తెలిసిన తర్వాత దాన్ని పట్టుకునేందుకు అక్కడికి చేరుకున్నాడు.గడ్డి ప్రాంతం ఉన్న ఏరియాలో పామును వెతికి దాని తోకను పట్టుకున్నాడు స్నేక్ క్యాచర్.అయితే పామును పట్టుకోగానే అది వెంటనే అది చేతి మీద ఒక్కసారిగా గట్టిగా కాటు వేసి అలాగే వదిలిపెట్టకుండా ఉండింది.

తన పదునైన కోరలతో ఒక్కసారిగా అతనిపై అటాక్ చేసింది.ఈ దెబ్బతో కొద్దిసేపు నొప్పితో అతడు ఇబ్బందిపడిన ఆ తర్వాత ఏమాత్రం భయపడకుండా దాన్ని పట్టు నుంచి ఎలాగోలాగా తప్పించాడు.

అయితే ఈ క్రమంలో అతడి చేతికి బాగా గాయమైంది.అంతేకాదు రక్తం కూడా బాగానే కారింది.అక్కడ అదృష్టం ఏమిటంటే.ఆ పాము ( Snake )విషపూరితం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఈ వీడియోని చూసిన సోషల్ మీడియా నేటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.వామ్మో.ఏంది బ్రో పాము కాటేసిన అంత ప్రశాంతంగా ఉన్నావు అంటూ కొందరు కామెంట్ చేస్తుండగా.మరి కొందరేమో బాసు నువ్వు గ్రేట్.అంటూ అతడిని ప్రశంసిస్తున్నారు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోను ఒకసారి వీక్షించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube