టాలీవుడ్ హీరో మంచు విష్ణు( Manchu Vishnu ) డ్రీం ప్రాజెక్ట్ అయిన భక్తకన్నప్ప మూవీ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే.తరచూ ఈ సినిమాకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటాయి.
ఇకపోతే మంచి విష్ణు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్( Prabhas ) కీలకపాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.వీరితో పాటు ఇంకా చాలామంది స్టార్ సెలబ్రెటీలు ఈ సినిమాలో నటిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా మంచి విష్ణు ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్నీ బయట పెట్టారు.ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.
కన్నప్ప సినిమాలో( Kannappa Movie ) ప్రభాస్ నాతో నటించలేదు.నాతో మాత్రమే నటించలేదు.
అతడి పాత్ర ఏంటి అనేది ప్రస్తుతానికి నేను చెప్పలేను.సినిమాలో అతడు ఎవరితో నటించాడు, ఎంత సేపు కనిపిస్తాడు లాంటి వివరాలు ఇప్పుడే చెప్పను.
నా ఒక్కడితోనే ఆయన చేయలేదు అని చెప్పుకొచ్చారు మంచు విష్ణు.

విష్ణు చేసిన వాక్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మరి ప్రభాస్ ఎలాంటి పాత్రలో నటిస్తున్నాడు? ఎంతసేపు కనిపించనున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.మొత్తానికి విష్ణు చేసిన వ్యాఖ్యలతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి జులై నుంచి ప్రతి సోమవారం ఒక అప్ డేట్ వచ్చేలా డిఫరెంట్ గా ప్రమోషన్ ప్లాన్ చేశారు.
తాజాగా ఈ సినిమా టీజర్( Kannappa Teaser ) విడుదలైన విషయాలు తెలిసిందే.కన్నప్పలో నటించిన కీలక నటీనటులంతా టీజర్ లో కనిపించారు.కాకపోతే వాళ్ల కళ్లను మాత్రమే చూపించారు.ప్రభాస్, కాజల్, అక్షయ్ కుమార్.
ఇలా కీలక పాత్రలు పోషించిన స్టార్స్ అందర్నీ క్లోజప్ లో మాత్రమే చూపించారు.మంచు విష్ణు గెటప్, ఎలివేషన్స్ కోసమే టీజర్ ను ఎక్కువగా వాడుకున్నారు.