ఏపీ లో వైసిపి( YCP ) ఘోరంగా ఓటమి చెందడం , టిడిపి, జనసేన, బీజేపీ కూటమి అధికారం లోకి రావడంతో జగన్ కు( Jagan ) ఇబ్బందులు మొదలయ్యాయి.ఏపీలో వైసిపి కి 11 స్థానాలు మాత్రమే దక్కాయి.
ఈ ఎన్నికల్లో ఓటమిని ఇప్పటికీ వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.ముఖ్యంగా ఈ ఓటమి పై జగన్ సమీక్షలు మొదలుపెట్టారు.
ఇక ఏపీలో వైసిపి కి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి.గత ప్రభుత్వ నిర్ణయాలు, పథకాల అమలులో తలెత్తిన అవినీతి వ్యవహారాలు వంటి వాటిపై టిడిపి, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది.
ఇదిలా ఉంటే తెలంగాణ లోనూ చంద్రబాబు కు( Chandrababu ) సన్నిహితుడుగా పేరుపొందిన రేవంత్ రెడ్డి సీఎం గా ఉండడంతో అక్కడ కూడా జగన్ కు కష్టాలు మొదలైనట్టుగానే కనిపిస్తున్నాయి.
తాజాగా హైదరాబాద్ లోని జగన్ నివాసం లోటస్ పాండ్( Lotus Pond ) ప్రాంగణంలో ఆక్రమణ లను జిహెచ్ఎంసి( GHMC ) అధికారులు కూల్చివేయడం చర్చేనీయాంసంగా మారింది.జగన్ ముఖ్యమంత్రి కాక ముందు హైదరాబాద్ లో ఇదే ప్రాంగణంలో నివాసం ఉండేవారు.అక్కడ నుంచి పార్టీ వ్యవహారాలను పరిరక్షించేవారు.2019 ఎన్నికలకు ముందు తాడేపల్లిలో ఇంటి నిర్మాణం పూర్తిచేసుకుని అక్కడే నివాసం ఉంటున్నారు.హైదరాబాద్ లోని( Hyderabad ) లోటస్ పాండ్ లో షర్మిల, విజయమ్మ కుటుంబ సభ్యులు ఉంటున్నారు.
ఇప్పుడు లోటస్ పాండ్ లో అక్రమ నిర్మాణాలు ను జిహెచ్ఎంసి సిబ్బంది కూల్చివేయడం మొదలుపెట్టారు.ఇక్కడ కొంతమేర రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేసినట్లుగా అభియోగాలు ఉన్నాయి.ఇప్పటికే దీనిపై నోటీసులు ఇచ్చారు.ఫుడ్ పాత్ ఆక్రమించి సెక్యూరిటీ పోస్టుల నిర్మాణం చేసినట్లు గుర్తించారు.గతంలోనే వీటిని తొలగించాల్సిందిగా నోటీసులు ఇచ్చారు.అయినా స్పందించకపోవడంతో స్థానికుల ఫిర్యాదు మేరకు ఈరోజు జిహెచ్ఎంసి అధికారులు వాటిని కూల్చివేయడం ఇప్పుడు రాజకీయంగాను చర్చనీయాంశంగా మారింది.