తీవ్రమైన మెడనొప్పి ఉన్నా షూట్ లో పాల్గొన్న రవితేజ.. డెడికేషన్ కు ఫిదా అవ్వాల్సిందే!

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ( Mass Maharaja Ravi Teja ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.రవితేజ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

 Director Harish Shankar About Ravi Teja Dedication Details, Raviteja, Ravi Teja-TeluguStop.com

సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు రవితేజ.కాగా రవితేజ చివరిగా టైగర్ నాగేశ్వరరావు, ధమాకా లాంటి సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాలు పరవాలేదు అనిపించుకున్నాయి.

ఇకపోతే రవితేజ సినిమాల పట్ల ఎంత డెడికేషన్ గా ఉంటారో మనందరికీ తెలిసిందే.మిగతా విషయాల్లో ఎలా ఉన్నా కూడా సినిమాల విషయంలో చాలా సిన్సియర్ గా ఉంటారు.ఇదే విషయం గురించి తాజాగా దర్శకుడు హరీష్ శంకర్( Harish Shankar ) సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

అసలేం జరిగిందంటే.రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మిస్టర్ బచ్చన్.

( Mr Bachchan Movie ) ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.అయితే ఈ మూవీ సెట్స్ లో రవితేజ తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ.

తీవ్రమైన మెడనొప్పితోనూ రవితేజ అన్నయ్య పని చేస్తున్నారు.

మాస్‌ మహారాజ్‌ డెడికేషన్‌ కు హ్యాట్సాఫ్‌.ప్రతిరోజూ మీరు నాకు స్ఫూర్తినిస్తుంటారు అని రాసుకు వచ్చారు హరీష్ శంకర్.ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు రవితేజకు జాగ్రత్తలు చెబుతున్నారు.

ఆరోగ్యం జాగ్రత్త అన్నా కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోండి అంటూ కామెంట్ చేస్తున్నారు.ఇకపోతే గతంలో హరీష్ శంకర్, రవితేజ కాంబినేషన్ లో కొన్ని సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే.

ముఖ్యంగా వీరి కాంబినేషన్లో వచ్చిన మిరపకాయ్ సినిమా విడుదల అయ్యి మంచి విజయం సాధించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube