ఆ సినిమా కోసం 12 kmల క్యూ లైన్..బాహుబలిని మించిన రికార్డ్స్

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం బాహుబలి.ఈ సినిమాను కొట్టే మరోసినిమా ఇప్పట్లో వస్తుందని చెప్పలేం.

 Unknown Facts About Simhasanam Movie-TeluguStop.com

ఒక్కమాటలో చెప్పాంటే బాహులికి ముందు.బాహుబలి తర్వాత అని సినిమా ఇండస్ట్రీని విభజించుకోవచ్చు.

సేమ్ ఒకప్పుడు టాలీవుడ్ లో కూడా ఇలాంటి సంచలనం చేసింది ఓ జానపద సినిమా.ఇంతకీ ఆ సినిమా ఏంటో ఇప్పుడు చూద్దాం.

తన నట విశ్వరూపంలో సూప‌ర్ స్టార్ గా గుర్తింపు పొందారు కృష్ణ‌.ఆయనకు జాన‌ప‌ద చిత్రం తీయాల‌ని ఎంతో ఇష్టం ఉండేది.1980లో సింహాసనం పేరుతో సినిమా ఓకే అయ్యింది.తన సినిమాకు భారీ బ‌డ్జెట్ అవుతుందని తెలియడంతో నిర్మాత‌ల‌ను రిస్క్‌ లో పెట్ట‌డం ఇష్టం లేని ఆయన.తానే స్వ‌యంగా త‌న ప‌ద్మాల‌యా స్టూడియోస్ బ్యాన‌ర్‌పై సింహాస‌నం సినిమాను నిర్మించాలనుకున్నారు.తానే ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం చేయాలనుకున్నారు.

ఎట్ట‌కేల‌కు సినిమా నిర్మాణం చేప‌ట్టారు.సినిమా తీస్తున్న స‌మ‌యంలో నిత్యం పేప‌ర్ల‌లో షూటింగ్‌కు సంబంధించిన వార్త‌లు వ‌చ్చేవి.

ఈ సినిమాలో బాలీవుడ్ నటి మందాకిని నటించింది.జ‌య‌ప్ర‌ద‌, రాధ ఇందులో యాక్ట్ చేశారు.

బ‌ప్పీల‌హ‌రి సంగీతాన్ని అందించారు.ఇక సినిమా కేవ‌లం 53 రోజుల్లోనే షూటింగ్ చేసి విడుద‌ల చేశారు.మూవీకి రూ.3.50 కోట్ల బ‌డ్జెట్ అయింది.అప్ప‌ట్లో స‌గ‌టు సినిమా బ‌డ్జెట్ రూ.50 ల‌క్ష‌లు.

భారీ అంచ‌నాల న‌డుమ సింహాస‌నం మూవీ 1986 మార్చి 21న తెలుగుతోపాటు హిందీలోనూ విడుద‌ల చేశారు.

హిందీలో ఈ మూవీ సింహాస‌న్ పేరిట విడుద‌లైంది.అందులో జితేంద్ర హీరోగా న‌టించారు.

అయితే ఊహించిన దానిక‌న్నా ఈ మూవీకి ప్రేక్ష‌కుల నుంచి ఎక్కువ స్పంద‌న ల‌భించింది.బాక్సాఫీస్ క‌లెక్ష‌న్స్ పెరిగాయి.మొద‌టి వారం రూ.1.51 కోట్ల గ్రాస్‌ను సాధించింది.సింగిల్ థియేట‌ర్‌లో ఏకంగా రూ.15 ల‌క్ష‌ల గ్రాస్ సాధించింది.వైజాగ్‌లో ఈ మూవీ 100 రోజుల పాటు నాన్‌స్టాప్ గా హౌస్ ఫుల్ క‌లెక్ష‌న్స్‌ లో రికార్డులు కొల్లగొట్టింది.3 సెంటర్లలో ఈ మూవీ రూ.10 ల‌క్ష‌ల‌కు పైగా వ‌సూళ్లు చేసింది.ఓవ‌రాల్‌గా రూ.4.50 కోట్ల షేర్ సాధించింది సంచనలం విజయం నమోదు చేసింది.  తొలిసారి తెలుగులో నటించిన మందాకినిని చూడటానికి 12 kmల క్యూ లైన్ ఉండటం చెప్పుకోవాల్సిన విషయం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube