ప్రముఖ నటి రమ్యకృష్ణ మొత్తం ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

తెలుగు ప్రేక్షకులకు సీనియర్ నటి ఒకప్పటి స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ( Ramya Krishna ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఒకప్పుడు తెలుగులో ఎన్నో సినిమాలలో స్టార్ హీరోయిన్ గా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.

 Do You Know About Ramyakrishnan Life Style And Net Worth Details, Ramya Krishna,-TeluguStop.com

తన కళ్ళతోనే హావభావాలు పలికించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను నటించి మెప్పించింది.కాగా 1967 సెప్టెంబర్ 15న చెన్నైలో జన్మించిన రమ్యకృష్ణ 1990 నుంచి 2000 వరకు దాదాపు దశాబ్ద కాలంపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో అనేక సినిమాల్లో నటించి మెప్పించింది.

Telugu Ramya Krishna, Ramyakrishna, Tollywood-Movie

చిన్న వయసులోనే నటిగా సినీరంగంలోకి అడుగుపెట్టి ఎనిమిదో తరగతి చదువుతూనే వెల్లై మనసులో ప్రధాన పాత్ర పోషించింది.ఆ తర్వాత బాల మిత్రులు( Bala Mitrulu ) సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది.తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించింది.మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున, రాజశేఖర్, మోహన్ బాబు వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది.

హీరోయిన్ గానే కాకుండా విలన్ క్యారెక్టర్స్ కూడా అదరగొట్టింది.రజినీకాంత్, సౌందర్య జంటగా నటించిన నరసింహ సినిమాలో( Narasimha Movie ) నీలాంబరి పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది.

Telugu Ramya Krishna, Ramyakrishna, Tollywood-Movie

ఈ సినిమా రమ్యకృష్ణకు మంచి పేరు తెచ్చిపెట్టింది.చాలాకాలం పాటు కథానాయికగా నటించిన రమ్యకృష్ణ యంగ్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది.ప్రస్తుతం తల్లిగా నటిస్తుంది.దాదాపు 30 ఏళ్లకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతుంది రమ్యకృష్ణ.అంతే కాకుండా భారీగానే ఆస్తులు సంపాదించింది.ఇప్పటివరకు ఆమె దాదాపుగా 90 కోట్లకు పైగా సంపాదించినట్టు తెలుస్తోంది.

కాగా ఇప్పుడున్న నటీమణులలో అత్యధిక పారితోషికం తీసుకునే నటి కూడా ఆమె.ఒక్కో సినిమాకు రూ.3 నుంచి రూ.4 కోట్ల వరకు తీసుకుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube