తొమ్మిదేళ్ల తర్వాత తల్లి కాబోతున్న ప్రముఖ బుల్లితెర నటి.. సంతోషంలో ఫ్యాన్స్!

తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ నటి ద్రష్టి ధామి ( Drashti Dhami ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బాలీవుడ్ పలు హిందీ సీరియల్స్ లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 Tv Actress Drashti Dhami Announces Pregnancy After 9 Years Marriage Details, , D-TeluguStop.com

ముఖ్యంగా బుల్లితెరపై ఈమెకు భారీగా క్రేజ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.ఒకవైపు సీరియల్స్ లో నటిస్తూనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫుల్ బిజీబిజీగా గడుపుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

ఇక ఆ సంగతి పక్కన పెడితే తాజాగా ఈమె అభిమానులకు ఒక శుభవార్తను తెలిపింది.

తాను త్వరలోనే తల్లిని( Mother ) కాబోతున్నట్లు ఆమె ప్రకటించింది.ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.ఇందుకు సంబందించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఈ ఏడాది అక్టోబర్‌లో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ఆమె వెల్లడించింది.ఇకపోతే ఆమె విషయానికి వస్తే.

ద్రష్టి ధామి 2015లో నీరజ్ ఖేమ్కాను( Niraj Khemka ) పెళ్లి చేసుకుంది.పెళ్లి తర్వాత దాదాపు తొమ్మిది ఏళ్లకు ఈమె గుడ్ న్యూస్ చెప్పడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మొదట ఆమె డాన్స్ రియాల్టీ షో అయిన నాచ్ బలియేలో( Nach Baliye ) కూడా పాల్గొన్నారు.ధామి 2007లో టీవీ సీరియల్‌ దిల్ మిల్ గయేతో ద్వారా ఎంట్రీ ఇచ్చింది.2010లో గుర్మీత్ చౌదరి సరసన గీత్ – హుయ్ సబ్సే పరాయి సీరియల్‌ లోనూ కనిపించింది.ఆమెకు మధుబాల, ఏక్ ఇష్క్ ఏక్ జునూన్‌ సీరియల్‌తనే ఎక్కువగా ఫేమ్ తెచ్చుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube