రంజాన్ మాసం స్టార్ట్ అయింది.ఈ మాసంలోనే దివ్య ఖురాన్ అవతరించిందని ముస్లింలు నమ్ముతుంటారు.
రంజాన్ అంటే అందరికీ మొదట గుర్తుకు వచ్చేది ఉపవాసమే.ఈ పవిత్ర మాసంలో ముస్లింలు భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో అల్లాహ్‌ను స్మరించుకుంటూ కఠన ఉపవాస దీక్షలు చేపడతారు.
అయితే ప్రస్తుత వేసవి కాలంలో ఉపవాసాలు చేయడం అంటే మామూలు విషయం కాదు.అందులోనూ మధుమేహ బాధితులకు మరింత కష్టతరంగా ఉంటుంది.
అయినప్పటికీ కొందరు ఉపవాసాలకు పూనుకుంటారు.అలాంటి వారు ఖచ్చితంగా కొన్ని కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి.
లేదంటే ప్రాణాలే రిస్క్‌లో పడతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం మధుమేహ బాధితులు ఉపవాసం ఉంటే ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం పదండీ.
ఉపవాసం ఉండే మధుమేహ వ్యాధి గ్రస్తులు శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి.అందు కోసం వాటర్‌తో పాటు కొబ్బరి నీళ్లు, మజ్జగ, సబ్జా వాటర్, పండ్ల రసాలు, లెమన్ జ్యూస్ వంటివి సేవించాలి.
ఇవి బాడీలో నీటి స్థాయిలు పడిపోకుండా అడ్డు కట్ట వేస్తాయి.అలాగే మధుమేహం ఉన్న వారు ఉపవాస సమయంలో రోగ నిరోధక వ్యవస్థను బలంగా ఉంచుకోవడం ఎంతో అవసరం.
కాబట్టి, ఉపవాసం చేసేటప్పుడు తప్పకుండా గ్రీన్ టీ లేదా ఏదో ఒక హెల్బల్ టీని సేవించాలి.మధుమేహ బాధితులు ఉపవాసం చేస్తున్నట్లయితే రోజూవారీ డైట్‌లో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే ఫుడ్స్‌ను చేర్చుకోవాలి.
ఇవి శరీరాన్ని యాక్టివ్‌గా ఉంచుతాయి.మరియు ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి.

ఉపవాస సమయంలో మధుమేహం ఉన్న వారు తప్పకుండా నట్స్‌ను తీసుకోవాలి.ముఖ్యంగా బాదం, వాల్‌నట్స్, పిస్తా, కాజు వంటి వాటిని తీసుకుంటే.వాటిలో ఉండే ప్రత్యేక సుగుణాలు రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపు తప్పకుండా చూస్తాయి.ఇక రంజాన్ మాసంలో ఉపవాసాలు చేసే మధుమేహ బాధితులు ఎప్పటికప్పుడు షుగర్ టెస్ట్‌ను కూడా చేయించుకుంటూ ఉండాలి.







