విటమిన్ సప్లిమెంట్స్ మనిషి జీవిత కాలాన్ని పెంచుతాయా.. తగ్గిస్తాయా..?

మనిషి సగటు జీవన కాలం అనేది ప్రస్తుత రోజుల్లో చాలా తక్కువ అయి పోయింది.

ఒకప్పుడు ప్రజలు ఎటువంటి అనారోగ్యం లేకుండా దాదాపు తొంబై ఏళ్ల పాటు జీవించేవారు.

కానీ ఈ కాలంలో ప్రజలు 40 ఏళ్లకే వివిధ రకాల అనారోగ్యాలతో ఇబ్బందులు పడుతున్నారు.మనం తీసుకునే ఆహారంలో పోషకాహార లోపం వలన లేని పోని అనారోగ్యలు తలేత్తుతున్నాయి.

అయితే చాలా మంది ప్రజలు అనారోగ్యం అని అనిపించిన వెంటనే విటమిన్ సప్లి మెంట్లును మందుల రూపంలో మింగేస్తు ఉంటారు.ఫలితంగా విటమిన్ లోపాలు తగ్గిపోతాయి అనుకుంటారు.

నిజానికి అందులో ఎలాంటి వాస్తవం లేదని ఒక అధ్యయనం చెబుతుంది.పోషకాహారం లోటును ఎటువంటి విటమిన్ సప్లిమెంట్లు భర్తీ చేయలేవని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.

Advertisement

ఒక్కోసారి పోషకాహార లోపం వలన అనారోగ్య సమస్యలతో పాటు అకాల మరణం కూడా సంభవించే అవకాశాలు కూడా లేకపోలేదు.విటమిన్ లోపం అనేది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటేనే తప్ప వేరే ఏ ఇతర విటమిన్ సప్లిమెంట్స్ తీసుకుంటేనే మాములు అవ్వదు.

తాజాగా ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం సమతుల్యాహారం తినడం వల్ల అకాల మరణాన్ని తప్పించు కోవచ్చు.అంతే కాకుండా ఎటువంటి అనారోగ్యాలు కూడా లేకుండా జీవించే రేటు కూడా పెరుగుతుంది.

ఎప్పటికప్పుడు సమతులాహారం తీసుకుంటూ, ఆరోగ్యకరమైన జీవనశైలి అవలంబిస్తూ ఉండడం చాలా ముఖ్యం.ఇవి రెండు పాటించ కుండా విటమిన్ల లోపం అని తెలియగానే మల్టీ విటమిన్లను వాడడం మంచిది కాదు.

ఈ విటమిన్లు వాడడం వలన ఆరోగ్యం మాట ఎలా ఉన్నాగాని రాబోయే రోజుల్లో అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.ఆరోగ్యాన్ని కాపాడు కోవడానికి వాడే విటమిన్ సప్లిమెంట్లు జీవితాకాలాన్ని ఎట్టి పరిస్థితుల్లో పెంచలేవని అధ్యయన కర్తలు తేల్చి చెప్పారు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..

 హెల్త్ అండ్ న్యూట్రిసన్ ఎగ్జామినేషన్ సర్వేలో దాదాపు 30,000 మంది సర్వేలో పాల్గొనగా ఈ విషయం తెలిసింది.వారందరిని కొన్నేళ్ల పాటూ వారి ఆహార అలవాట్లను గమనించారు.

Advertisement

ఇలా సర్వేలో పాల్గొన్న వారిలో 3,600 మందికి పైగా మరణించారు.అలాగే 945 మంది గుండె జబ్బులతోను, 805 మంది క్యాన్సర్ తో అకాల మరణం బారిన పడ్డారు.

అయితే విరందరు కూడా పోషకాలు సరిగా అందక మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లు తీసుకున్నవారే అవ్వడం గమనార్హం.అయితే మంచి ఆహారం తీసుకున్నవారిలో మాత్రం ఎటువంటి విటమిన్ లోపాలు లేకపోవడంతో పాటు వారు అధిక కాలం జీవించినట్టు గుర్తించారు.

ఈ అధ్యయనం బట్టి చూస్తే పోషకాహారాలోపాన్ని ఎటువంటి విటమిన్ సప్లిమెంట్లు సంపూర్ణంగా తీర్చలేవని అర్ధం అవుతుంది.పూర్తిగా విటమిన్ సప్లిమెంట్స్ పైన మాత్రమే ఆధార పడకుండా సమతుల్య ఆహారం తీసుకోవడం మంచిది అని నిపుణుల సలహా.

తాజా వార్తలు