ఏ కాలానికి ఆ కాలం వస్తూనే ఉంటుంది.దాంతో పాటు అనేకరకాల వ్యాధులు వ్యపిస్తూనే ఉంటాయి.
అన్నీ కాలాల్లో కెల్లా వర్షాకాలం.సీతాకాలలు ఎక్కువగా వ్యాధులు ప్రభలుతాయి.
ఎందుకంటే రోగకారక బ్యాక్టీరియా వృద్ది చెందటానికి ముఖ్య కారణం చల్లని ప్రదేశాలు.వేసవి కాలంలో ఎటువంటి బ్యాక్టీరియా అయినా సరే వ్యాప్తి చెందదు.
అందుకే నీటిలో ఆడినప్పుడు కానీ.చల్లని ప్రాంతాలకి వెళ్ళేటప్పుడు కానీ తొందరగా జబ్బు పడుతారు అనేకమంది.
ఈ కాలలో ఎక్కువగా మనిషి ఎదుర్కునే రోగాలు జ్వరం ,జలుబు,దగ్గు , ఇతర వ్యాధులు ప్రబలుతుంటాయి.వైరస్…బ్యాక్టీరియాలు సోకితే శరీరంలోని రోగనిరోధక శక్తి బలహీన పడుతుంది.అందువల్ల బొంగురు గొంతు, తరచూ తుమ్ముల్లు, దగ్గు, కండరాలు పట్టుకోవడం తదితర సమస్యలు ఏర్పడుతాయి.మలేరియా, డెంగీ, టైఫాయిడ్, హెపటైటిస్ ఎ ఇతరత్రా వ్యాధులు వస్తాయి.
ఈ సమస్యలు శీతాకాలం,వర్షాకాలంలో సహజంగానే వస్తాయి కానీ వీటిని అశ్రద్ధ చేస్తే మాత్రం ప్రాణాలకే హాని కలగవచ్చు.
చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి .దోమలు వృద్ధి చెడకుండా చుసుకోవాలి.అంతేకాదు నీరు ఎక్కడన్నా నిల్వ ఉంటే వెంటనే తొలగించాలి.
ఈ కాలాల్లో కాచి వడబోసిన నీరు త్రాగడం ఆరోగ్యానికి చాల మంచిది.ట్యాక్ లలో ఉండే నీరు శుభ్రంగా ఉందొ లేదో చూసుకోవాలి.
తొట్టెలలో పట్టుకునే నీటిలో కొంచం పసుపు వేయడం.వేడి నీటితో స్నానం చాలా ఉత్తమం.
స్నానం చేసే నీటిలో వేపాకులు,చిటికెడు పసుపు వేయడం వలన శరీరానికి ఉండే చెడు బ్యాక్టీరియా పోతుంది.ఈ కాలంలో డీహైడ్రేషన్, డయేరియా, వాంతులు, శరీరం పొడిబారడం, విరోచనాలు ఉంటే అది కలరా లక్షణాలని గుర్తించాలి.
ఎక్కువగా ఇంటి భోజనం చేయడానికి ప్రయత్నించండి.ఎంత తక్కువగా బయటి తిండి తింటే అంత మంచిది.