మారుతున్న ఈ కాలంలో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరికీ గుండె పోటులు వస్తున్నాయి.చిన్న చిన్న పిల్లలు సైతం ఈ గుండె పోటు భారినపడటం చాలా భాదాకరం.
దీనికి కారణం మారుతున్న ఆహారపు అలవాట్లు.కాలుష్యం.
ఇలా ఒకటేమిటి అనేకమైన సమస్యలు కారణం అవుతున్నాయి.అధికంగా పాల ఉత్పత్తులు .మాంసం తినడం కూడా .గుండె పోటుకి చేటు తెస్తాయి .మానసిక వత్తిడికి లోనైపుడు కూడా ఇలాంటి ప్రమాదాలు సంబవిస్తుంటాయి.మరి వీటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమి తీసుకోవాలి అనేది చూద్దాం.
ప్రతీ రోజు ఉదయం 30 నిమిషాల నడక కనీసం 5 రోజులైనా చెయ్యాలి.కొవ్వు పదార్ధాలు లేని ఆహారాన్ని తీసుకోవాలి.ఆకు కూరలు, ఫ్రూట్స్ తప్పకుండా మన తీసుకునే ఆహారంలో భాగం చేసుకోవాలి.ఈ సమస్య తగ్గుముఖం పట్టేవరకు ఎప్పటికప్పుడు చెకప్ చేయించుకుంటూ ఉండాలి.
ఎక్కువగా గుండెని అలసపెట్టే పనులు చేయకూడదు.మనసుకి నచ్చిన ప్రదేశాలకి వెళ్ళాలి.
అమరితో సరదాగా గడపాలి.చల్లటి నీటిని దూరం పెట్టండి.
గోరువెచ్చని నీటిని త్రాగండి.బీపీ,షుగర్ ఉన్నవారు అవి కంట్రోల్ లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి.
ఎక్కువగా గ్రీన్ టీ తాగడం నేరుచుకోండి.కనీసం రోజులో సుమారు 4 సార్లు అయినా సరే త్రాగడం వలన శరీరానికి సరపడా రోగనిరోధకశక్తిని పెంచే శక్తిని ఇవ్వవచ్చు .
మీరు పని చేస్తున్నప్పుడు కానీ మెట్లని ఎక్కుతున్నప్పుడు కానీ.ఆయాసం అనిపించినప్పుడు వెంటనే పనిని ఆపండి.
చల్లని గాలి తగిలే చోట కూర్చోండి.శరీరానికి రెస్ట్ ఇవ్వాలి.
చాలా మంది గుండెపోటు సమస్య ఉన్నవారు.ఆ సమస్యని చాలా చిన్నగా చూస్తారు.
కానీ అది అత్యంత ప్రమాదకరమైన సమస్య అని చివరివరకు వారికి తెలియదు.అలాంటివారు గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటింటే.
మీ ఇంట్లో మీ మీద ఆధారపడి చాలా మంది ఉంటారు.పిల్లలు కానీ ఇంకా ఎవరైనా సరే.మీరు లేకపోతే వారి పరిస్థితిని ఒక్కసారి ఆలోచించండి.గుండె పోటు ముందస్తుగానే రాకుండా ఉండటానికి అందరు జాగ్రతలు తీసుకుంటే ఆర్ధికంగా కూడా మనం నష్టపోకుండా ఉంటాం.