మెగా ఫ్యామిలీ నుండి హీరోలుగా చాలా మంది ఎంట్రీ ఇచ్చారు.వారిలో ఒకరు ఇద్దరు సక్సెస్ అయ్యారు.
కొందరు సక్సెస్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.మెగా స్టార్ రేంజ్ కు రావాలంటే చాలా కాలం చాలా పట్టుదల అవసరం అనే విషయం తెల్సిందే.
అలా ఇప్పుడు అల్లు ఫ్యామిలీ నుండి అల్లు శిరీష్ కూడా హీరోగా రాణించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.అల్లు శిరీష్ మొదట ఇండస్ట్రీలో కొనసాగాలి కాని నిర్మాతగా లేదా మరో రకంగా అనుకున్నారు.
కాని ఆయన మెదడులో ఆలోచన రావడంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. గౌరవం సినిమా తో ఇండస్ట్రీ లో హీరో గా అడుగు పెట్టిన అల్లు శిరీష్ కు మొదటి సినిమా తోనే నిరాశ తప్పలేదు.
అందుకే ఆయన హీరోగా అప్పటి నుండి ఇప్పటి వరకు కష్టాలు తప్పడం లేదు.
పుష్కర కాలంగా ఇండస్ట్రీలో సక్సెస్ ల కోసం చకోరా పక్షి మాదిరిగా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న శిరీష్ ఇప్పటికి కూడా పెద్దగా సక్సెస్ లే అందుకోలేదు.
ఇండస్ట్రీ లో ఆయన చేసిన సినిమా లు తక్కేవు.ఇక చాలా నెలలుగా ఆయన సినిమా కోసం అల్లు అభిమానులు ఎదురు చూస్తున్నారు.అదుగో ఇదుగో అంటూ శిరీష్ తన సినిమా ను వాయిదా వేస్తూ వస్తున్నారు.హీరోగా అల్లు శిరీష్ నటించిన సినిమా ల విషయానికి వస్తే ఆయన సినిమా ల సంఖ్య చాలా తక్కువగా ఉంది.
ఆయన పుట్టిన రోజు నేడు.ఈ సందర్బంగా ఆయన సినిమాకు సంబంధించి ఏమైనా అప్డేట్ వస్తుందేమో అని అంతా భావించారు.
కాని ఆయన నుండి ఎలాంటి సినిమా అప్‌డేట్ ఇవ్వలేదు.కనీసం పెళ్లి గురించి ఏమైనా స్పందిస్తాడేమో అంటే అది కూడా లేదు.