రేపాల కేంద్రంగా ప్రత్యేక మండల డిమాండ్...!

సూర్యాపేట జిల్లా:నాగార్జునసాగర్ ( Nagarjuna sagar )ఎడమ కాలువ సూర్యాపేట జిల్లా మునగాల మండలం మీదుగా ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ లోకి వెళుతుండడంతో మొత్తం మండలాన్ని అనాదిగా ఆయకట్టు ప్రాంతంగా పరిగణిస్తూ వస్తున్నారు.అయితే మునగాల మండలంలో మొత్తం 22 గ్రామ పంచాయితీలు,8 శివారు గ్రామాలు ఉండగా, అందులో 11గ్రామ పంచాయితీలు,2 శివారు గ్రామాలు ఆయకట్టు కింద ఉన్నాయి.

 Demand For A Special Zone As The Center Of Repala...!, Special Zone , Repala ,-TeluguStop.com

మిగతా 11 గ్రామ పంచాయితీలు,6 శివారు గ్రామాలకు ఎన్ఎస్పీ కెనాల్ నీళ్ళు అందక బోరు బావుల కింద చాలీచాలని నీళ్లతో, వచ్చీరాని కరెంట్ తో ఏళ్ల తరబడి సాగు చేయలేక రైతాంగం నానా అవస్థలు పడుతూ రోజు రోజుకు వ్యవసాయానికి దూరంఅవుతున్నారు.కెనాల్,నాన్ కెనాల్ గా విడిపోయిన మునగాల మండలం.

మునగాల మండలం సగం గ్రామాలు కెనాల్,మిగతా సగం గ్రామాలు నాన్ కెనాల్ గా రెండుగావిడిపోయాయి.మునగాల,నారాయణగూడెం,కృష్ణానగర్,బరాఖత్ గూడెం, ముకుందాపురం,ఆకుపాముల,కోదండరామాపురం, నర్సింహపురం కెనాల్ కింద సాగులో ఉండగా, కొక్కిరేణి,తిమ్మారెడ్డిగూడెం,గణపవరం లిఫ్ట్ ఇరిగేషన్ కింద సాగులో ఉన్నాయి.

ఇక దశాబ్దాల తరబడి రేపాల,సీతానగరం, నర్సింహులగూడెం, జగన్నాథపురం,విజయరాఘవాపురం,మాధవరం,నేలమర్రి,ఈదులవాగుతండా,వెంకట్రామాపురం,తాడువాయి,కలకోవ గ్రామాలు పూర్తిగా నాన్ కెనాల్ కింద ఉండి కరువుతో అల్లాడుతున్నా మండలం మొత్తం కెనాల్ కింద ఉందని ప్రభుత్వాలు కరువు మండలంగా ప్రకటించక అన్నదాతలను అరిగోస పెడుతున్నాయి.ప్రత్యేక మండలంగా ప్రకటించండి.

మండలంలో 22 గ్రామాల్లో 11 గ్రామాలకు వ్యవసాయానికి సాగునీరు,త్రాగు నీరు అందుతుంది.నాన్ కెనాల్ కింద 11 గ్రామాలకు సాగునీరు,త్రాగు నీరు కూడా అందడం లేదు.

మా గ్రామాలకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్ళు ఇవ్వాలని, నీళ్ళు వచ్చే వరకు కరువు ప్రాంతంగా ప్రకటించి,నాన్ కెనాల్ కింది గ్రామాలను కలిపి “రేపాల( Repala ) మండల కేంద్రంగా” ప్రత్యేక రూరల్ మండలంగా ఏర్పాటు చేయండని రైతులు,ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.దీనితో ఎంతో కాలంగా రేపాల మండల కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటు చేయాలనే డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది.

గత పాలకులు కొన్ని నూతన మండలాలు ఏర్పాటు చేశారు.కానీ,మునగాల( Munagala ) లాంటి పెద్ద మండలాన్ని వదిలేశారు.నాన్ కెనాల్ ఏరియా నుండి మండల కేంద్రానికి రావాలంటే సరైన రవాణా వ్యవస్థ లేక సుమారు 10 నుండి 25 కి.మీ.ప్రయాణం చేసి రావాల్సిన పరిస్థితి ఉంది.అదే విధంగా మునగాల మండల కేంద్రం నేషనల్ హైవే 65 పై ఉండడంతో అభివృద్ది మొత్తం కెనాల్ ప్రాంతంలోనే కేంద్రీకృతమై, నాన్ కెనాల్ ప్రాంతాన్ని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.

కాంగ్రెస్ సర్కార్లో అయినా జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోని, 11 నాన్ కెనాల్ గ్రామ పంచాయితీలను కలిపి రేపాల మండల కేంద్రంగా నూతన మండలాన్ని ఏర్పాటు చేసి,ఈ ప్రాంతానికి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగు,త్రాగు నీరు అందించేలా,ఈ గ్రామాలు అభివృద్ది బాట పట్టేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఆరుగాలం కష్టించినా ఫలితం లేకుండా పోతుందని నేలమర్రి గ్రామానికి చెందిన బచ్చలకూరి స్వరాజ్యం అన్నారు.

మునగాల మండలంలో ఉన్న పాపానికి చుక్కనీరు లేని మా గ్రామాలు అభివృద్ధికి నోచుకోక దశాబ్దాల తరబడి వర్షాలు,మోటార్ల మీద ఆధారపడి జీవిస్తున్నాం.చెరువులు, బావులు,బోరుబావులు నుంచి చుక్కనీరు రాక ఈ ప్రాంతం ఎడారిలా మారింది.

అన్నదాతలు పొట్టకూటి కోసం పట్టణ ప్రాంతాలకు వలస పోతున్నారు.గత పాలకులు చేసిన పొరపాట్లను ప్రస్తుతకాంగ్రెస్ సర్కార్ అయినా పరిష్కరించాలి.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవ తీసుకొని 22 గ్రామాలకు సాగునీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలి లేదా నాన్ కెనాల్ ప్రాంతాన్ని ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేసి,అభివృద్ధికి బాటలు వేయాలి.కెనాల్ కింద ఉన్నామని మమ్ముల్ని దశాబ్దాల నుండి పాలకులు విస్మరించారు.

లిఫ్టుల కింద వేసిన పంటలు ఎండుతున్నాయని కొక్కిరేణి గ్రామానికి చెందిన ధరావత్ రవి అన్నారు.మాకు కెనాల్ నీళ్లు ఉన్నా లేనట్టే.

పాత బావులు పూడికలు తీపించి బోర్ల మీద ఆధారపడి వరి సాగు చేస్తున్నాం.ఈమధ్య కాలంలోనే మా గ్రామంలో 40 బోర్లు వేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

మా ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి.లేదా సాగుకు నీళ్లైనా ఇవ్వండని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube