ప్రముఖ దర్శకుడు కె విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా నువ్వే కావాలి.ఈ సినిమాలో తరుణ్ హీరోగా నటించగా సెకండ్ హీరోగా సాయి కిరణ్ నటించారు.
ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తుకు ఉండే ఉంటుంది.ఈ సినిమాలో అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉందిఅనే పాటలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి హీరో సాయి కిరణ్ తెలియని వారంటూ ఉండరు.
హీరో సాయి కిరణ్ వచ్చీరావడంతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.ఆ తరువాత వరుస సినిమాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు.కానీ ఆ సినిమాలు ఏవి కూడా సాయి కిరణ్ కి గుర్తింపును తీసుకరాలేదు.అయితే ప్రస్తుతం సాయి కిరణ్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కాగా.ఇంతకీ ఆ వార్త ఏంటంటే సాయి కిరణ్ అప్పట్లో తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినటువంటి ప్రియురాలిని తన కుటుంబ సభ్యుల కోసం వదిలిపెట్టాడని సాయి కిరణ్ ప్రేమ గురించి కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.

అయితే అప్పట్లో సాయి కిరణ్ ప్రేమించినటువంటి మహిళ కూడా తెలుగు సినీ పరిశ్రమకి చెందిన హీరోయిన్ అని, అంతేగాక ఆమెతో సాయి కిరణ్ పలు చిత్రాల్లో నటించారంట.అంతేకాదు హీరో సాయి కిరణ్ ప్రముఖ సింగర్ పి.సుశీల మనవడని చాలామందికి ఇప్పటికీ తెలీదు.ఇక ప్రస్తుతం సాయి కిరణ్ హైదరాబాద్ నగర పరిసర ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది.అంతేకాదు.ప్రస్తుతం సాయి కిరణ్ చేతిలో పెద్దగా సినిమా అవకాశాలు లేకపోవడంతో బుల్లితెర మీద ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నారు.
ఇక ఇందులో టాలీవుడ్ ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి మా ఛానెల్ లో ప్రసారమయ్యే మానసిచ్చి చూడు అనే ధారావాహికలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.ఇక ఏదేమైనప్పటికీ వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అనుకున్న సాయి కిరణ్ కి ఆ అవకాశాలన్నీ తీవ్ర నిరాశనే మిగిల్చాయనీ చెప్పడంలో ఎటువంటి సందేహం లేదనే చెప్పాలి మరి.