Snow Wedding : వైరల్ వీడియో: – 25 డిగ్రీల ఉష్ణోగ్రతలో పెళ్లి..! చివరకి..?!

పెళ్లి( Marriage ) అనేది ఓ మనిషి జీవితంలో మధురమైన సంఘటన అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.అయితే కార్యక్రమాన్ని వధూవరులు వారి స్తోమతకు తగ్గట్టుగా.

 Snow Wedding : వైరల్ వీడియో: – 25 డిగ్రీ-TeluguStop.com

, అలాగే వారి ఆచార వ్యవహారాలను అనుసరిస్తూ వివాహం చేసుకుంటారు.కాకపోతే ఈ రోజుల్లో దంపతుల కోరికలకు అనుగుణంగా వారి పెళ్లిళ్లు క్రేజీగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

అందులో ముఖ్యంగా వారి పెళ్లికి పిలవడానికి ఇచ్చే పెళ్లి కార్డు నుండి మొదలు పెళ్లికి వచ్చిన అతిథులు భోజనం చేసే వరకు, వారికి ఇచ్చే రిటర్న్ గిఫ్టులు( Return Gifts ) వరకు ఏదైనా సరే వెరైటీగా ఉండాలంటూ అందుకు తగ్గట్టుగా ప్లాన్ చేస్తున్నారు.ఇక అసలు విషయంలోకి వెళితే.

తాజాగా ఓ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలకు వెళితే.

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం( Himachal Pradesh )లోని మంచుతో పూర్తిగా కప్పబడి ఉన్న స్ఫూర్తి లోయలో ఓ గుజరాతి జంట( Gujarati Couple ) పెళ్లి చేసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరిని ఆకర్షిస్తుంది.చలి ప్రభావానికి పూర్తిగా పెళ్లి దంపతులు వణుకుతుండడంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది.పెళ్లి జరిగిన ప్రాంతంలో ఉష్ణోగ్రత మైనస్ 25 డిగ్రీస్ ఉన్న కూడా వారి వివాహాన్ని చేసుకోవడం నిజంగా అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఈ వీడియోని చూస్తే ముందుగా పెళ్ళికూతురు ఎర్ర కారులోంచి బయటకు నిలబడి ఫోటోలకి ఫోజు ఇవ్వడం మొదలవ్వగా.ఆ తర్వాత ఆ మంచులో ఏర్పాటు చేసిన పెళ్లి మండపం( Snow Wedding ) చూడవచ్చు.ఆపై పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కలిసి ఫోటోగ్రాఫర్లకు ఫోజులు ఇవ్వడం కూడా మనం గమనించవచ్చు.

ఆ తర్వాత వారి సాంప్రదాయ ప్రకారం వధూవరులు ఇద్దరు ఒకటవ్వడం మనం వీడియోలో గమనించవచ్చు.ఏదేమైనా ప్రస్తుతం పెళ్లి చేసుకోబోయే వారికి ఈ వీడియో కాస్త క్రేజీగా అనిపించవచ్చు.

చూడాలి మరి ఈ వీడియో చూసి ఇంకెంతమంది ఇలాంటి పెళ్లిళ్లు చేసుకోవాలనుకుంటున్నారో.ఇంకెందుకు ఆలస్యం ఈ క్రేజీ వీడియోలు మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube