మచ్చలు పోయి ముఖం తెల్లగా మెరవాలా.. అయితే రోజు నైట్ ఇలా చేయండి!

ముఖంపై ముదురు రంగు మచ్చలు( Spots ) మనల్ని కాంతిహీనంగా చూపిస్తాయి.

అందుకే చర్మంపై మచ్చలు ఏర్పడ్డాయి అంటే వాటిని వదిలించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.

మచ్చలను వదిలించుకుని ముఖాన్ని తెల్లగా మార్చుకునేందుకు ఆరాటపడుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే క్రీమ్ మీకు చాలా ఉత్తమం గా సహాయపడుతుంది.రోజు నైట్ ఈ క్రీమ్ ను రాసుకుని పడుకుంటే మచ్చలు పోయి మీ ముఖ చర్మం తెల్లగా అందంగా మారుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ క్రీమ్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి.

అలాగే రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు( Flax seeds ) వేసి 15 నిమిషాల పాటు ఉడికిస్తే జెల్ తయారవుతుంది.స్టవ్ ఆఫ్ చేసి స్ట్రైనర్ సహాయంతో జెల్ ను సపరేట్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి.

Advertisement

ఇప్పుడు ఒక టమోటా( Tomato ) ను తీసుకుని ముక్కలుగా కట్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజల జెల్ ( Flax seed gel )వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, నాలుగు టేబుల్ స్పూన్లు టమోటా జ్యూస్, హాఫ్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్( Glycerin ), హాఫ్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.తద్వారా ఒక మంచి క్రీమ్ సిద్ధం అవుతుంది.

ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.నైట్ నిద్రించే ముందు ఈ క్రీమ్ ను ముఖానికి అప్లై చేసుకుని రెండు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.రోజు నైట్ ఈ క్రీమ్ రాసుకుంటే ముఖంపై ఎలాంటి మచ్చలు ఉన్నా సరే క్రమంగా త‌గ్గు ముఖం పడతాయి.

చర్మం హైడ్రేటెడ్ గా మారుతుంది.గ్లోయింగ్ గా మెరుస్తుంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

అదే సమయంలో స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది.చర్మం తెల్లగా మారుతుంది.

Advertisement

స్పాట్ లెస్ వైట్ అండ్ గ్లోయింగ్ స్కిన్ ను కోరుకునే వారు తప్పకుండా ఈ క్రీమ్ ను ప్రయత్నించండి.

తాజా వార్తలు